‘సలార్‘ బీభత్సం.. 18 గంటల్లో 100 మిలియన్లు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘సలార్‘. ఎన్నాళ్ల నుంచో ఫ్యాన్స్ ను ఊరిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రిలీజైంది మొదలు ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను కొల్లగొడుతోంది. మొత్తంగా ఐదు భాషల్లో వచ్చిన ఈ ట్రైలర్.. కేవలం 18 గంటల్లోనే అన్ని భాషల్లోనూ కలిపి 100 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఒక విధంగా ఇండియన్ మూవీ ట్రైలర్స్ లో ఇదో పెద్ద రికార్డ్.

‘సలార్‘ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్యూర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దాదాపు నాలుగు నిమిషాలున్న ఈ ట్రైలర్ లో యంగ్ రెబెల్ స్టార్ కనిపించింది కేవలం నిమిషంన్నర మాత్రమే. అయినా.. ఆ విజువల్స్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచాయి. ‘బాహుబలి‘ తర్వాత ప్రభాస్ ను మళ్లీ పూర్తి స్థాయి యాక్షన్ అవతార్ లో చూపించబోతున్న సినిమా ఇది. ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా ‘సలార్‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts