కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న ‘యానిమల్‘

రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్‘. గత కొన్ని సంవత్సరాలుగా ఏ సినిమా కూడా రానంత అత్యంత ఎక్కువ నిడివితో ఈ సినిమా నిన్న ఆడియన్స్ ముందుకొచ్చింది. నిడివి ఎక్కువైనా ఎక్కడా బోర్ లేకుండా తన దర్శకత్వం, ఎడిటింగ్ తో ప్రేక్షకుల్ని థియేటర్లలో సీట్లకు అతుక్కుపోయేలా చేయడంలో సఫలమయ్యాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. తండ్రీకొడుకుల అనుబంధాన్ని తన మార్క్ వైలెన్స్ తో ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించాడు సందీప్.

‘యానిమల్‘ మూవీ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. తొలి రోజే ఏకంగా రూ. 116 కోట్లు వసూళ్లను సాధించింది. దీంతో హిందీ సినిమాల్లోనే ది బిగ్గెస్ట్ నాన్ హాలిడే ఓపెనింగ్ గా ‘యానిమల్‘ నిలిచింది. మరోవైపు నార్త్ అమెరికాలో ఫస్ట్ డే 2.5 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘యానిమల్‘ కలెక్షన్స్ బాగున్నాయనేది ట్రేడ్ టాక్.

Related Posts