బాలకృష్ణ ఫుల్ ఫామ్ లోకి వచ్చి రెండేళ్లు

నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్ లోకి వచ్చి రెండేళ్లయ్యింది. అంటే.. బాలయ్య వెండితెర అద్భుతం ‘అఖండ‘కు రెండేళ్లన్న మాట. డిసెంబర్ 2, 2021న విడుదలైన ‘అఖండ‘ చిత్రం అద్భుతమైన విజయాన్నందించింది. ‘యన్టీఆర్ కథానాయకుడు, యన్టీఆర్ మహానాయకుడు, రూలర్‘ వంటి సినిమాల ఫ్లాప్స్ తో సతమతమైన బాలకృష్ణను ‘అఖండ‘ తిరిగి ఫామ్ లో నిలబెట్టింది. అప్పటికే నటసింహంతో ‘సింహా, లెజెండ్‘ వంటి సినిమాలను తీసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో అఖండ రుద్ర సికందర్ అఘోరాగా, మురళీ కృష్ణగా ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు నటసింహం.

తమన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో మరో కీలక భూమిక పోషించాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తర్వాత బాలయ్యకు ‘వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి‘ రూపంలో మరో రెండు భారీ బ్లాక్ బస్టర్స్ లభించాయి. మొత్తంమీద.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ తర్వాత బోయపాటితో మరో సినిమా చేసే అవకాశాలున్నాయి.

Related Posts