‘ఖైదీ’ చిత్రానికి 40 ఏళ్లు’

చిరంజీవిని ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత ఖైదీని చేసిన చిత్రం ‘ఖైదీ’. 1983, అక్టోబర్ 28న విడుదలైన ‘ఖైదీ’ ఓ ఫ్రభంజనమే సృష్టించింది. చిరు సినీ కెరీర్ ను మలుపుతిప్పిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో అనతి కాలంలోనే అతను మెగాస్టార్ గా ఎదగడానికి దోహదపడింది.

‘ఖైదీ’ సినిమా కంటే ముందే చిరంజీవికి హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. అప్పటికే ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లైన చిరంజీవి.. 50 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇక హీరోగా ‘న్యాయం కావాలి, ఇంట్లో రామయ్య వీధిల్లో కృష్ణయ్య, శుభలేఖ, అభిలాష’ వంటి విజయాలున్నాయి. అయితే చిరంజీవికి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరిచిన సినిమా ‘ఖైదీ’.

అసలు సూపర్ స్టార్ కృష్ణ కోసం అనుకున్న కథే ‘ఖైదీ’. కృష్ణ చేయలేకపోయిన ఈ సినిమాని చిరంజీవితో నిర్మించారు సంయుక్త మూవీస్ అధినేతలు ఎమ్.తిరుపతి రెడ్డి, ధనంజయ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి. ఇక.. అప్పటికే చిరంజీవితో పలు సినిమాలు చేసిన కోదండ�