మహేష్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో

సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా వచ్చి తనూ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు మహేష్‌ బాబు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు. మహేష్‌కంటే ముందే ఆయన అన్న రమేష్‌ హీరో అయ్యాడు. కానీ స్టార్డమ్ తెచ్చుకోలేక కొన్నాళ్లకే తప్పుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన మహేష్‌ మాత్రం తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. మహేష్ అండగానే సుధీర్ బాబు తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఇతనితో పాటు మహేష్‌ ఫ్యామిలీకి చెందిన గల్లా అరుణ తనయుడు అశోక్ ఆ మధ్య హీరో అనే సినిమాతో హీరోగా మారాడు. ప్రస్తుతం మరో సినిమా చేస్తున్నాడు. బిజినెస్ మేన్ కమ్ పొలిటీషియన్ అయిన గల్లా జయదేవ్ తనయుడు అశోక్. జయదేవ్ మహేష్‌ కు బావ.


హీరోగా అశోక్ ఫ్యూచర్ ఏంటీ అనేది ఇంకా తేలలేదు. అయినా అదే ఫ్యామిలీ నుంచి మరో హీరోను లాంచ్ చేయబోతున్నారు. అంటే అశోక్ తమ్ముడు అన్నమాట. అతని పేరు సిద్ధార్థ గల్లా. త్వరలోనే ఇతన్ని కూడా హీరోగా పరిచయం చేయబోతున్నారు. అయితే అశోక్ లా కాకుండా సిద్ధార్థను ఇంకాస్త గ్రాండ్ గా లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

అంటే కాస్త పెద్ద కాన్వాస్ తో వస్తాడన్నమాట. వీరికి డబ్బులకు కొదవ లేదు. అందుకే ఓ మంచి దర్శకుడు, కాస్త లావిష్ గా ఉండే కంటెంట్ తో ఇంటర్ డ్యూస్ చేయాలనుకుంటున్నారు. సో.. అన్న ఇంకా ప్రూవ్ చేసుకోకుండానే తమ్ముడు వస్తున్నాడు. అంటే ఇంట్లోనే పోటీ ఉంటుంది. మరి ఈ అన్నదమ్ముల్లో ఎవరికి ముందుగా స్టార్డమ్ వస్తుందో చూడాలి.