సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతి

సూపర్ స్టార్ కృష్ణ.. కేవలం తన ఫ్యాన్స్ తోనే కాదు.. ప్రేక్షకులందరితోనూ ఇలా అనిపించుకున్న ఏకైక నటుడు. నటశేఖరుడిగా తెలుగు కళామతల్లికి ముద్దుబిడ్డగా మారాడు. తెలుగు సినిమాకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేశాడు. ఎన్నో సాహసోపేతమైన కథల్లో నటించాడు. మాస్ ఇమేజ్ ఉన్నా అన్ని రకాల పాత్రల్లో మెప్పించాడు.. అదే కృష్ణను అందరికీ చేరువ చేసింది.

కృష్ణ నటుడిగానే కాదు.. మంచి మనిషిగానూ పేరు తెచ్చుకున్న అతి కొద్దిమందిలో అగ్రస్థానంలోనూ నిలుస్తాడు. ఏదైనా మనస్ఫూర్తిగా చేయడం కృష్ణ నైజం. అందుకే జయాపజయాలతో పెద్దగా పనిలేకుండానే ఆయన కెరీర్ సాగింది. సూపర్ స్టార్ కృష్ణ మనకు దూరమై అప్పుడే సంవత్సరం అయిపోయింది. 2022, నవంబర్ 15న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు సూపర్ స్టార్.

Related Posts