అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్

Read More

రివ్యూ : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంతారాగణం : నాంది నరేష్‌, ఆనంది, శ్రీ తేజ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్, ప్రవీణ్, రఘుబాబు తదితరులుఎడిటర్ : చోటా కె ప్రసాద్సంగీతం : శ్రీ చరణ్‌

Read More

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతోంది. ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ తో టీమ్ ప్రమోషన్ ‌ల దూకుడు పెంచబోతోంది. ట్రైలర్ కు సంబంధించి థియేట్రికల్, డిజిటల్ రిలీజ్ కోసం మేకర్స్ రెండు వేర్వేరు తేదీలను లాక్ చేశారు. నవంబర్ 11న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుండగా, డిజిటల్ వెర్షన్ నవంబర్ 12న విడుదల చేస్తున్నారు.’ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ సమంత ‘యశోద’, హాలీవుడ్ యాక్షన్-..అడ్వెంచర్ బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్ చిత్రాలను ప్రదర్శించే అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ పోస్టర్‌ లో అల్లరి నరేష్ అడవిలో గిరిజనులతో కలిసి నడుస్తూ సీరియస్‌గా కనిపిస్తున్నారు, అతని పక్కనే ఒక వ్యక్తి నరేష్ చేయి పట్టుకుని రావడం కనిపిస్తోంది. పోస్టర్ విడుదల తేదీని చూపిస్తోంది.ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Read More

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా టీజర్‌, మెలోడీ సాంగ్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది. నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్.ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Read More

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రెండో చిత్రంగా ‘ఉగ్రం’ తెరకెక్కుతోంది. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ క్యూరియాసిటీ పెంచింది. ఫస్ట్ లుక్‌ లో అల్లరి నరేష్ శరీరం నిండా గాయాలతో ఫెరోషియస్ గా కనిపించాడు,లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో కథానాయికగా మిర్నా మీనన్ ని ఎంపిక చేశారు. మిర్నా ఇంతకుముందు మోహన్ లాల్ బిగ్ బ్రదర్‌ తో పాటు తమిళం, మలయాళ సినిమాలలో నటించింది. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా. తన తొలి చిత్రాన్ని విలక్షణమైన కథతో తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల ఉగ్రం కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశారు. ఇందులో నరేష్ ని చాలా డిఫరెంట్ రోల్ లో ప్రెజెంట్ చేస్తున్నారు.కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. తారాగణం:- అల్లరి నరేష్, మిర్నా మీనన్ సాంకేతిక విభాగం :- రచన, దర్శకత్వం:- విజయ్ కనకమేడల నిర్మాతలు:- సాహు గారపాటి, హరీష్ పెద్ది బ్యానర్:- షైన్ స్క్రీన్స్ కథ:- తూము వెంకట్ డైలాగ్స్:- అబ్బూరి రవి డీవోపీ:- సిద్ సంగీతం:- శ్రీచరణ్ పాకాల ఎడిటర్:- ఛోటా కె ప్రసాద్ ప్రొడక్షన్ డిజైనర్:- బ్రహ్మ కడలి పీఆర్వో:- వంశీ-శేఖర్

Read More

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఈ చిత్రాన్ని తన సరికొత్త

Read More

అల్లరి నరేష్ అనే తన కామెడీ ఇమేజ్ ను మెల్లమెల్లగా పోగొట్టుకుంటున్నాడు. ఫస్ట్ మూవీనే ఇంటి పేరుగా పెట్టుకున్నా.. కామెడీ హీరో అన్న ట్యాగ్ వచ్చినా.. తన వరకూ వచ్చిన ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్

Read More

హిట్టు కొడితే చాలు.. ఆ తర్వాత ఆఫర్స్ అవే వస్తాయి అనుకుంటారు చాలామంది. ఇది నిజమే. కానీ కొన్నిసార్లు హిట్ కొట్టినా వెంటనే ఛాన్స్ లు రావు. ఆ పరిస్థితిలోనే ఉన్నాడు నాంది డైరెక్టర్

Read More

నరేష్.. అంటే చాలామందికి 80,90ల హీరో గుర్తొస్తాడు. ఆ పేరుకు ముందు అల్లరి చేరిస్తే.. ఇప్పటి నరేష్ గుర్తొస్తాడు. ఈ ఒక్క మాట చాలు.. ఈ అల్లరి.. నరేష్ జీవితాన్ని ఎంతలా మార్చిందో. ఇవివి

Read More