రెండో సినిమాకూ ‘నాంది’ పలుకుతున్నారా..?

హిట్టు కొడితే చాలు.. ఆ తర్వాత ఆఫర్స్ అవే వస్తాయి అనుకుంటారు చాలామంది. ఇది నిజమే. కానీ కొన్నిసార్లు హిట్ కొట్టినా వెంటనే ఛాన్స్ లు రావు. ఆ పరిస్థితిలోనే ఉన్నాడు నాంది డైరెక్టర్ విజయ్. నాంది సినిమాతో కమర్షియల్ గానూ, విమర్శియల్ గానూ ఆకట్టుకుంటుంది. అల్లరి నరేష్ లోని సిసలైన నటుడిని చూపించిన ఈ మూవీ తర్వాత విజయ్ నిర్మాతలు వచ్చారు కానీ.. హీరోలు సెట్ కాలేదు. చాలామందికి కథలు చెప్పాడు. బట్ ఎవరూ ఓకే చెప్పలేదు. దీంతో మళ్లీ ఫస్ట్ హీరోతోనే వస్తున్నాడట..

అల్లరి నరేష్.. అత్యంత వేగంగా యాభై సినిమాలు పూర్తి చేసుకున్న హీరో. కామెడీ హీరోగానే గుర్తింపు తెచ్చుకున్నా తనదైన ముద్రను వేశాడు. అప్పుడప్పుడూ సీరియస్ సినిమాల్లో కనిపించి తనలోని కొత్త యాంగిల్ నూ చూపించాడు. అయితే కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు నరేష్. పైగా ఇప్పుడు కామెడీ కోసమే అయితే సినిమాలే చూడక్కర్లేదు.. బుల్లితెరపైనే అనేక ఫార్మాట్స్ వచ్చాయి. మరోవైపు మంచి కథలు ఎంచుకోవడంలోనూ నరేష్ వైఫల్యం కనిపించింది. ఈ టైమ్ లో వచ్చిన నాంది అతనికి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. తన ఇమేజ్ కు సంబంధించిన ఒక్క ఫ్రేమ్ కూడా లేకుండా పూర్తి సీరియస్ మోడ్ లో వచ్చిన నాంది సూపర్ హిట్ అనిపించుకుంది.
నిజానికి నాంది లాంటి కథలు చెప్పే దర్శకులు తెలుగులో చాలా తక్కువ.

నాందితో ఆకట్టుకున్న విజయ్ కనకమేడలకు షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఆఫర్ ఇచ్చింది. ఆ ఉత్సాహంతో మరో కథను పట్టుకుని చాలామంది కుర్ర హీరోలను అప్రోచ్ అయ్యాడట విజయ్. కానీ కొందరికి డేట్స్ లేవు. మరికొందరికి కథ నచ్చలేదు. దీంతో చాలాకాలంగా ఖాళీగా ఉంటోన్న ఈ దర్శడికి మరోసారి నరేష్ నే అప్రోచ్ అయ్యాడట. అతను కూడా ఓకే అన్నట్టు చెబుతున్నారు. అయితే హీరోలు మారినప్పుడు కథల్లోనూ మార్పులు తప్పవు. ఆ మార్పులకు టైమ్ పడుతుంది కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ మరికొంత కాలం లేట్ అవుతుందంటున్నారు. మరోవైపు నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తయ్యాక విజయ్ మూవీ ఉంటుందేమో చూడాలి.

Related Posts