తమ్ముడుతో వర్ష బొల్లమ్మ

తమిళ్ లో వచ్చిన మెలోడియస్ లవ్ స్టోరీ 96 మూవీతో ఫేమ్ అయింది వర్ష బొల్లమ్మ. తనే తెలుగులోనూ ఆ సినిమా రీమేక్ జాను లోకూడా నటించింది.ఆ తర్వాత ఇక్కడ హీరోయిన్ గా రెండు మూడు సినిమాల్లోనూ కనిపించింద. కానీ ఆశించిన బ్రేక్ రాలేదు. అయినా తన ప్రయత్నాలేవో తను చేస్తోంది. అయితే లేటెస్ట్ గా తను ఓ షార్ట్ డెసిషన్ తీసుకుంది. నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు సినిమాలో నటించేందుకు ఒకే చెప్పింది. ఇందులో తప్పేముందీ అనుకుంటారేమో. తప్పేం లేదు. కానీ తను ఈ సినిమాలో హీరోయిన్ కాదు. ఓ చిన్న పాత్రట. ఇంకా చెబితే గెస్ట్ రోల్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుందని టాక్. పైగా తన పాత్ర చిత్రీకరణ ఫస్ట్ షెడ్యూల్ లోనే అయిపోతుందని చెబుతున్నారు.

మరి హీరోయిన్ గా ప్రయత్నిస్తోన్న తను ఇంత చిన్న పాత్రకు ఓకేచెప్పడం కొందరిని ఆశ్చర్యపరుస్తోంది. అదే టైమ్ లో ఎంతో కొంత ఇంపార్టెన్స్ లేకపోతే తను మాత్రం ఎందుకు ఎస్ అంటుందీ అని కూడా అంటున్నారు.


ఇక దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కాంతార బ్యూటీ సప్తమి గౌడను ఆల్రెడీ తీసుకున్నారు. కాంతారలో చూసిన సప్తమి నితిన్ కు జోడీగా అంటే కాస్త పెద్దగా కనిపిస్తుందేమో అనేవాళ్లూ లేకపోలేదు. అయినా ఒక్కో సినిమాకు ఒక్కోలా కనిపించే అవకాశం ఉంది కాబట్టి అతనికి జోడీగా బానే ఉంటుందంటున్నారు. మొత్తంగా వర్ష బొల్లమ్మ కూడా ఓ కీలక పాత్ర చేస్తోన్న ఈ చిత్రం 2024 సమ్మర్ లో విడుదలవుతుందనుకుంటున్నారు.

Related Posts