స్కంద ట్రైలర్ తో సరిపెట్టుకోవడమేనా

స్కంద సినిమా స్టార్ట్ అయినప్పుడు.. చాలామంది అనుకున్నది రామ్, బోయపాటి కాంబో ఎలా వర్కవుట్ అవుతుందా అని. బోయపాటి సినిమా అంటే ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్. మాసిజం హెవీ డోస్ లో ఉంటుంది. అందుకోసం ఆ ఇమేజ్ ఉన్న హీరోలనే సెలెక్ట్ చేసుకుంటాడు బోయపాటి శ్రీను. బట్ రామ్ కు అంత ఇమేజ్ లేదు. అందుకే మొదట కొంత అనుమానించారు. బట్ ఒక్కో లుక్, టీజర్, ట్రైలర్ తో రామ్ ను కూడా తన ఇమేజ్ కు దగ్గరగా తీసుకువచ్చాడు బోయపాటి అనిపించాడు. ట్రైలర్ తర్వాత అందులో కొత్తదనం లేకపోయినా రామ్ మీద కామెంట్స్ ఏం రాలేదు అనేది నిజం. రామ్ కూడా ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు అని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది.


ఇక ఈ నెల 28న విడుదల కాబోతోన్న స్కంద ప్రమోషన్స్ చాలా అంటే చాలా వీక్ గా ఉంది. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా.. వీళ్లేం పట్టించుకోవడం లేదు. అసలు ప్రమోషన్స్ చేసే ఉద్దేశ్యం కూడా లేనట్టే కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల చేస్తారని ఆ మేరకు ప్రమోషన్స్ కోసం డేట్స్ కేటాయించింది హీరోయిన్ శ్రీ లీల. వీళ్లు అనూహ్యంగా పోస్ట్ పోన్ చేసుకుని ఈ 28కి వస్తున్నారు. దీంతో తను డేట్స్ అడ్జెస్ట్ చేసి ప్రమోషన్స్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. ఆల్రెడీ నేను రాను అని ఖచ్చితంగానే చెప్పింది. దీంతో ఇక చేసేదేం లేక.. వీళ్లు మరో ట్రైలర్ ను విడుదల చేయాలనుకుంటున్నారు.


ఫస్ట్ ట్రైలర్ ను బాలకృష్ణతో విడుదల చేయించి అప్పుడే పెద్ద ఫంక్షన్ చేశారు. మరి ఈ సారి కూడా అలా మరో హీరోతో ప్లాన్ చేస్తారా లేక క్యాజువల్ గా యూ ట్యూబ్ లో వదిలేస్తారా అనేది తెలియదు కానీ.. ఈ ట్రైలర్ ను మాత్రం పూర్తిగా ఫ్యామిలీ అంశాలతో నింపేస్తున్నారు అని చెబుతున్నారు. ఫస్ట్ ట్రైలర్ మాసివ్ గా ఉంది. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుందని టాక్. అలా అయితే మాస్ అండ్ క్లాస్ ను ఎంటర్టైన్ చేసినట్టుగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా స్కంద మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ఉండవు. ఇక ఈ ట్రైలర్ తో సరిపెట్టుకోవడమే అనేది బలంగా వినిపిస్తోన్న మాట.

Related Posts