బాలకృష్ణ సెట్స్ లోకి బాబీ డియోల్.. స్వాగతం పలికిన ఊర్వశి

ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా మంచి హిట్స్ దక్కించుకున్న బాబీ డియోల్ ‘యానిమల్‘తో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. ‘యానిమల్‘ మూవీతో హీరోగా రణ్ బీర్ కపూర్ కి ఎంత పేరొచ్చిందో.. అంతే స్థాయిలో విలన్ గా చేసిన బాబీ డియోల్ కి పేరొచ్చింది. ఈ మూవీతో బాబీ గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘యానిమల్‘లోని బాబీ డియోల్ పై చిత్రీకరించిన పాటే ట్రెండ్ అవుతోంది. ఏ రీల్ చూసినా ఇదే పాట దర్శనమిస్తుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తన విలనిజాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నాడు ఈ వెర్సటైల్ యాక్టర్.

తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘లో ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నాడు బాబీ. అయితే.. ఈ మూవీ షూటింగ్ డేలే అయ్యింది. ఈలోపులో నటసింహం బాలకృష్ణ రూపంలో మరో క్రేజీ తెలుగు మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. బాలకృష్ణ 109వ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. ‘ఎన్.బి.కె 109‘ ఫిల్మ్ ఫ్యామిలీలోకి బాబీని ఆహ్వానిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. బాబీ, ఊర్వశి ఇద్దరూ ఫ్లైట్ లో ట్రావెల్ అవుతూ బాలయ్య సెట్స్ లోకి వెళుతున్న పిక్స్ ఇవి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Related Posts