పీపుల్స్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఆవేశం అతని మారుపేరు.. విప్లవపంధా అతని జీవన మార్గం.. ప్రజా సమస్యలే అతని సినిమాకి కథా వస్తువులు.. మామూలు ప్రజలే అతని సినిమాలో పాత్రధారులు.. జేబులో చిల్లిగవ్వ లేకుండానే నిర్మాతా, దర్శకుడుగా మొదటి సినిమా నిర్మించిన కళాజీవి.. ఆర్. నారాయణ మూర్తి. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని వ్రాసుకోగలిగిన నిబద్ధత గల కళాకారుడు. సినిమా పరిశ్రమ ట్రెండ్స్ కు విరుద్ధంగా వెండితెర మీద నుంచి వర్గరహిత స్వర్గాన్ని కాంక్షిస్తోన్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పుట్టినరోజు ఈరోజు (డిసెంబర్ 31)

ఆర్ నారాయణమూర్తి.. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరు ఓ బ్రాండ్. సినిమా నటుడు అంటే వెండితెరపై ఆదర్శాలు వల్లిస్తాడు. నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ఉంటాడు అనే మాటను చెరిపి.. సినిమా జీవితాన్ని గడుపుతోన్న నిజమైన కథానాయకుడు నారాయణమూర్తి. సినిమా ద్వారా తను పదిమందికి ఏం చెబుతున్నాడో దాన్ని ఆచరించి చూపుతోన్న ఆదర్శవంతమైన హీరో. చిరువేషాలతో పరిచయమై.. హీరోగా మారి పెను సంచలనాలు సృష్టించిన చరిత నారాయణమూర్తిది.

వెండితెరను ఎరుపెక్కించిన అతి కొద్దిమంది దర్శకుల్లో అగ్రగణ్యుడు నారాయణమూర్తి. కాసుల వేటలో కమర్షియల్ సినిమా పేరిట వెర్రిమొర్రి వేషాలేస్తోన్న సినిమా పరిశ్రమలో నమ్మిన సిద్ధాంతం కోసం బ్లాంక్ చెక్ ఆఫర్స్ ను కూడా కాదనుకున్న గొప్ప నటుడు నారాయణమూర్తి. నాటి ‘అర్థరాత్రి స్వతంత్రం‘ నుంచి నేటి వరకూ ఆయనదే అదే బాట. అణగారిన వర్గాల ఆర్తనాదాలు కథా వస్తువులు. ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అల్లుకునే కథనాలు.. మాటల్లో తూటాలు.. పాటల్లో ధిక్కార స్వరాలు.. అన్ని సమస్యల పరిష్కారానికి అన్నల బాటే మార్గం అనే నినాదం.. కలిసి వెండితెరపై కనిపిస్తే అది ఆర్ నారాయణమూర్తి సినిమా.

అయితే మారుతున్న కాలానికి అనుగుణంగానే సినిమా కూడా చాలా మార్పులకు గురైంది. ఆ మార్పుల్లో నారాయణమూర్తి తరహా కథలకు చోటున్నా.. టెక్నికల్ గా ఆయన అప్డేట్ కాకపోవడం వంటి అంశాల వల్ల ఆయన సినిమాలు ఆడియన్స్ కు పెద్దగా నచ్చడం లేదనే �