‘కన్నప్ప‘లో మరో ఇద్దరు లెజెండ్స్

మంచు విష్ణు తలపెట్టిన అత్యంత భారీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘. హిందూ మైథాలజీ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్ణు టైటిల్ రోల్‌ లో నటిస్తున్నాడు. ఇక.. మోహన్‌ లాల్, శివ రాజ్‌కుమార్, ప్రభాస్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగస్వాములైనట్టు ఇప్పటికే ప్రకటించింది టీమ్. లేటెస్ట్ గా ఈ మూవీ కాస్టింగ్ లిస్టులోకి మరో ఇద్దరు లెజెండ్స్ చేరారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కోలీవుడ్ సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ లు ‘కన్నప్ప‘లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘కన్నప్ప‘ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమాలోని 80 శాతం చిత్రీకరణను పూర్తిచేయనున్నారట. హాలీవుడ్ లో ఘన విజయాలను సాధించిన ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్‘ వంటి చిత్రాలను ఇక్కడే షూట్ చేశారు.

కన్నప్ప తన రెండు కళ్లను శివుడికి అర్పించేందుకు సిద్ధపడిన శ్రీకాళహస్తి గుడిలోనే ఈ చిత్రం ప్రారంభమైంది. బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈ చిత్రం రూపొందుతోంది.

Related Posts