‘వకీల్ సాబ్‘తో పోటీకి సిద్ధమవుతోన్న ‘ప్రేమికుడు‘

ఒకప్పుడైతే సినిమా హాళ్లు మాత్రమే వినోద సాధనాలుగా ఉండేవి. భారీ విజయాలు సాధించిన చిత్రాలను మళ్లీ రీ-రిలీజులు చేసేవారు. కొన్ని సినిమాలైతే మొదటిసారి విడుదలకు మించిన రీతిలో రీ-రిలీజుల్లోనూ అదరగొట్టేవి. కొన్నైతే రీ-రిలీజుల్లోనే వందేసి రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈమధ్య రీ-రిలీజుల సంప్రదాయం జోరందుకుంది.

ఈకోవలోనే మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్‘. ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక.. మే 1నే గ్రాండ్ లెవెల్ లో రీ రిలీజ్ కు రెడీ అవుతోంది మరో చిత్రం ‘ప్రేమికుడు‘. ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమికుడు‘ 30 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ప్రభుదేవా, నగ్మా నటనతో పాటు ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన పాటలు చాలా పెద్ద హిట్టయ్యాయి. ఆ పాటలకు ప్రభుదేవా వేసిన స్టెప్పులు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. మే 1న తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లలో ‘ప్రేమికుడు‘ రీ రిలీజ్ కాబోతుంది.

Related Posts