వెంకటేష్, అనిల్ చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ!

విక్టరీ వెంకటేష్, అపజయమెరుగని అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా కన్ఫమ్ అయినట్టే. అయితే.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స్టార్ ప్రొడ్యసర్ దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా షురూ అయ్యాయట. ఈ చిత్రంకోసం భీమ్స్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నాడట అనిల్ రావిపూడి. భీమ్స్ ఇప్పటికే రెండు పాటలు రెడీ చేశాడట.

వచ్చే సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవ్వబోతున్న వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీ ఆద్యంతం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. త్వరలోనే అనౌన్స్ మెంట్ చేసి జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టే సన్నాహాల్లో ఉందట టీమ్. ఇప్పటికే వెంకటేష్ కి ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి విజయాలందించిన అనిల్ రావిపూడి.. ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా చెన్నై సోయగం త్రిష నటిస్తుందనే ప్రచారం ఉంది.

Related Posts