మే 3న థియేటర్లలో సినిమాల జాతర

మే 3న థియేటర్లలో సినిమాల జాతర ఉండబోతుంది. తెలుగు నుంచి మూడు సినిమాలు.. అనువాద రూపంలో మరొకటి కలిపి నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఆ సినిమాల విషయానికొస్తే.. ముందుగా చెప్పుకోవాల్సింది అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు’ముఫ్ఫై ఏళ్ల క్రితం ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన సూపర్ హిట్ టైటిల్ తో రూపొందిన అల్లరి నరేష్ చిత్రం ‘ఆ… ఒక్కటీ అడక్కు’. మల్లీ అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలకా నిర్మిస్తున్న ఈ సినిమాతో మళ్లీ కామెడీ ట్రాక్ ఎక్కాడు నరేష్. ఈ మూవీలో పెళ్లికాని ప్రసాద్ టైప్ క్యారెక్టర్ లో కడుపుబ్బా నవ్వించబోతున్నాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కి జోడీగా ఫరియా అబ్దుల్లా నటించింది. వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం‘. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. సుహాస్ కి జోడీగా పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ నటించారు. ఫేస్ బ్లైండ్ నెస్ అనే వ్యాధితో బాధపడే హీరో.. తనకు వచ్చిన ఆపదలను ఎలా ఎదుర్కొన్నాడు అనే కథతో ఈ చిత్రం రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ‘ప్రసన్న వదనం’ ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శబరి’. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న విడుదలవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. భర్తతో సమస్యల కారణంగా.. అతని నుంచి వేరుగా ఉంటూ తన కుమార్తెను ఒంటరిగా పెంచుకునే ఛాలెంజింగ్ రోల్ లో వరలక్ష్మి కనిపించబోతుంది.

మిల్కీ బ్యూటీ తమన్నా, మెస్మరైజింగ్ బ్యూటీ రాశీ ఖన్నా కనువిందు చేయబోతున్న హారర్ థ్రిల్లర్ ‘బాక్’. తమిళ దర్శకుడు, నటుడు సుందర్.సి పాపులర్ హారర్ సిరీస్ ‘అరణ్మనై’లో వస్తోన్న నాల్గవ సినిమా ఇది. ఈ మూవీలో సుందర్.సి హీరోగానూ నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో మే 3న ‘బాక్’ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి వంటి కమెయడిన్స్ కూడా నటించారు.

Related Posts