పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన నాగవంశీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పవన్ కోసం పిఠాపురంలో ప్రత్యక్షంగా చాలామంది బుల్లితెర, వెండితెర ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. ఇక.. సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ వంటి వారు పవర్ స్టార్ కి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు. లేటెస్ట్ గా మరో ప్రొడ్యూసర్ నాగవంశీ.. తన మద్దతు పవన్ కళ్యాణ్ కే అని బాహటంగా చెప్పేశారు.

టాలీవుడ్ లో వరుస సినిమాలు నిర్మిస్తున్న సితార సంస్థ అధినేత నాగ వంశీ.. పవన్ కళ్యాణ్ కు నేరుగా మద్దతు ప్రకటించారు. అంతేకాదు.. ఆంధ్ర జనాలు అంతా ఎన్నికల టైమ్ కు వెళ్లి, ఓటు వేయడం ద్వారా పవన్ కు సేవ చేయాలని పిలుపు ఇచ్చారు. విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో నాగవంశీ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Related Posts