రామ్ చరణ్ తో టాలెంటెడ్ హీరోయిన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆల్రెడీ కెరీర్ ఆరంభంలోనే మగధీర వంటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. బట్ దాన్ని కంటిన్యూ చేయడంలో కాస్త తడబడినా ఆర్ఆర్ఆర్ తో తిరుగులేని ప్లాట్ ఫామ్ దొరికింది. దాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లేలా ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు.

ఇండియాస్ టాప్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ కాస్త నిదానంగా షూటింగ్ జరుపుకుంటోంది. బట్ రీసెంట్ గా ఈ మూవీ యాక్షన్ పార్ట్ ను హిట్ డైరెక్టర్ శైలేష్ కొలనుకు ఇచ్చాడు నిర్మాత దిల్ రాజు. దీనికి శంకర్ కూడా ఒప్పుకున్నాడు. దీంతో గేమ్ ఛేంజర్ లో కాస్త వేగం పెరిగింది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, సునీల్ వంటి ఆర్టిస్టులున్నారు.


మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ సరికొత్తగా బాడీ బిల్డ్ చేయబోతున్నాడు. చూడగానే స్పోర్ట్స్ పర్సన్ అనిపించేలా కనిపించబోతున్నాడట. మరోవైపు అతను మత్స్యకారుల ఫ్యామిలీ నేపథ్యంలోనూ ఉంటాడంటున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మరోసారి తన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టినే తీసుకోవాలనుకున్నాడు బుచ్చిబాబు. బట్ ఈ పాత్రకు మంచి నటన వచ్చిన హీరోయిన్ అయితే బావుంటుందని చాలామంది సూచించారట. కృతిశెట్టి అందంగా కనిపించినా నటనలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. అందుకే మరో టాలెంటెడ్ హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు. తనెవరో కాదు. కీర్తి సురేష్‌.


యస్.. రామ్ చరణ్‌ సరసన కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కీర్తి ఇప్పుడు చాలా బిజీగా ఉంది. త్వరలోనే బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది. కానీ తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకుంది. ఆ మధ్య ఓ వేదికలో చరణ్‌ తో కలిసి నాటు నాటు స్టెప్పులు కూడా వేసింది. అందుకే తను గ్యారెంటీగా ఓకే చెబుతుంది అనే భావనలో ఉన్నారు మేకర్స్.

ఈ మేరకు ఇప్పటికే ఆమెను కాంటాక్ట్ చేసినట్టు సమాచారం. అయితే తను ఉన్న బిజీలో ఓకే చెబుతుందా లేదా అనేది చెప్పలేం కానీ.. ముందు కథ వినేందుకు ఒప్పుకుందట. ఒకవేళ కథ నచ్చితే డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి రెడీగానే ఉన్నట్టు చెబుతున్నారు. సో.. అన్నీ కుదిరితే రామ్ చరణ్ తో కీర్తి సురేష్ జోడీ కట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్ కూడా ఓ ఫ్రెష్ నెస్ ఫీలవుతారు.

Related Posts