ప్రభాస్ తో సీతారామం సీక్వెల్

ప్రభాస్ దూకుడుకు టాలీవుడ్ మాత్రమే కాదు మొత్తం ఇండియన్ సినిమానే ఆశ్చర్యపోతుంది. అంత పెద్ద స్టార్..ఇంత దూకుడుగా ఉండటం ఇప్పుడు ఏ ఇండస్ట్రీలోనూ లేదు అనే చెప్పాలి. ఓ వైపు వరుసగా సినిమాలు పోతున్నా.. అతని క్రేజ్, రేంజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆ కటౌట్ కు కన్న ఖలేజా అలాంటిది అనిపించుకుంటున్నాడు. సలార్ రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. కల్కి రెండు భాగాలుగా వస్తుంది.

సలార్ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28న వస్తుంది. సెకండ్ పార్ట్ 2024 సమ్మర్ లో అంటున్నారు. కల్కి మొదటి భాగం కుదిరితే సంక్రాంతికి లేదా సమ్మర్ లో వస్తుంది. రెండో భాగం 2025 సంక్రాంతికి గ్యారెంటీ అంటున్నారు. ఇక రాజా డీలక్స్ లైన్ లోనే ఉంది. ఇది 2024 దసరా బరిలో దిగే అవకాశం ఉంది. అయితే వీటిలో సలార్ షూటింగ్ అయిపోయినట్టే. కల్కి సెకండ్ పార్ట్ షూటింగ్ ఉంది. దీంతో మరో సినిమా చేయడానికి ఆస్కారం ఉంది. ఈ ఛాన్స్ ను సందీప్ రెడ్డికి ఇచ్చాడు.

వీరి కాంబినేషన్ లో ఆల్రెడీ స్పిరిట్ అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే కొన్నాళ్లుగా హను రాఘవపూడి డైరెక్షన్ లోనూ సినిమా ఉంటుందనే టాక్ ఉంది కదా.. అది టాక్ మాత్రమే కాదు. నిజంగానే ఉంది.


సీతారామం తర్వాత హను రాఘవపూడి పొటెన్సియల్ పెరిగింది అనేది నిజం. అతను చెబితే పెద్ద హీరోలు కథలు వినడానికి సిద్ధమయ్యారు. పైగా వైజయంతీ మూవీస్ లో ఇద్దరికీ మంచి ర్యాపో ఉంది కాబట్టే ప్రభాస్ వరకూ వెళ్లి లైన్ చెప్పాడు. అది విని స్క్రిప్ట్ డెవలప్ చేయమన్నాడట ప్రభాస్. అలా డెవలప్ అయిన కథే సీతారామం సీక్వెల్ లా ఉందని టాక్. యస్.. సీతారామం సాఫ్ట్ లవ్ స్టోరీ, శాడ్ ఎండింగ్. బట్ ప్రభాస్ తో కూడా అవే మంచు కొండల మధ్య ఓ మంచి యుద్ధం నేపథ్యంలో ఓ మంచి ప్రేమకథను చెప్పబోతున్నాడట.

బట్ ఈ సారి ప్రభాస్ బేలగా ఉండడు. వీరుడులా ఉంటాడు. ఒక యుద్ధాన్ని ఒంటి చేత్తో గెలిపించి.. తన ప్రేయసి కోసం వస్తాడు అనేది పాయింట్ ట. ఆ పాయింట్ ను ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా మసాలాలు జోడించి ఓ మాసివ్ గా ఉంటూనే మెస్మరైజింగ్ లవ్ స్టోరీ చెప్పబోతున్నాడు అంటున్నారు. ఇదే బ్యాక్ డ్రాప్ అంటే ఖచ్చితంగా ఇది సీతారామంకు సీక్వెల్ లానే ఉంటుంది కదా.. సో.. ఈ ప్రాజెక్ట్ ను ఈ యేడాదే అనౌన్స్ చేసి 2024 సెకండ్ హాఫ్‌ లో సెట్స్ పైకి వెళతారట. ఈ లోగా హను కూడా అనౌన్స్ మెంట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసుకుంటాడు అంటున్నారు. అదీ మేటర్.

Related Posts