సూర్య రోలెక్స్ .. లోకేష్‌ తో సినిమా ఫిక్స్

అసలు పాత్రలకంటే కొసరు పాత్రలే కొన్నిసార్లు ఎక్కువ గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. లేటెస్ట్ గా జైలర్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పాత్ర అలాంటిదే. దానికి ముందు కమల్ హాసన్ విక్రమ్ లో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. సినిమా అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో వచ్చిన రోలెక్స్ పాత్ర ఆ పదినిమిషాలూ థియేటర్స్ అన్నీ మార్మోగిపోయేలా చేసింది. ఆ పాత్రలో సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, నటన, గెటప్ అన్నీ ఎక్స్ ల్లెంట్ అనిపించుకున్నాయి. విక్రమ్ కలెక్షన్స్ లో రోలెక్స్ పాత్రను కూడా మరవకూడదు. అలాంటి సూర్యతో లోకేష్ కనకరాజ్ ఎప్పుడు సినిమా చేస్తాడు అనే ఆతృత ఆ ఇద్దరి అభిమానుల్లోనూ ఉంది.

ఆల్రెడీ సూర్య తమ్ముడు కార్తీతో చేసిన ఖైదీతోనే లోకేష్‌ ఎక్కువగా ఫేమ్ అయ్యాడు. ఆ మూవీతోనే విక్రమ్ కు ఓ కనెక్షన్ ఇచ్చాడు. ఆ కనెక్షన్ ను కొనసాగిస్తూనే ఇప్పుడు లియో చేస్తున్నాడు. ఓ రకంగా లోకేష్ సినీ యూనివర్స్ గా చెప్పుకుంటున్నారు. షార్ట్ ఫామ్ లో దాన్నే ఎస్.సి.యూ అంటున్నారు. ఈ యూనివర్శిటీలోకి త్వరలోనే సూర్య అడుగుపెట్టబోతున్నాడు.

ఇదేమీ రూమర్ కాదు. స్వయంగా సూర్యనే చెప్పిన విషయం. అందుకే కోలీవుడ్ మొత్తం ఇది హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సూర్య తమిళనాడులో తన అభిమానులతో ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు. తను చేస్తోన్న సినిమాల గురించిన విశేషాలు వారితో పంచుకుని అందరితోనూ ఫోటోస్ దిగాడు. ఈ సందర్భంగానే లోకేష్ కనకరాజ్ తనకు ఓ కథ నెరేట్ చేసిన విషయం చెప్పాడు. అది రోలెక్స్ సినిమానే అట. కాకపోతే ఇది పూర్తిగా రోలెక్స్ కు సంబంధించిన కథ.అంటే ఇతర కథలతో కనెక్షన్ లేకుండా ఉంటుంది. అంటే.. రోలెక్స్ ఇలా డ్రగ్ మాఫియాకు రారాజుగా ఎదగడానికి కారణమైన విశేషాలను చెబుతారేమో.


సూర్య ప్రస్తుతం కంగువ అనే సినిమా చేస్తున్నాడు. అతని కెరీర్ లోనే ఫస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ ఇది. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ప్యాన్ ఇండియన్ ను దాటి ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయి బాషల్లో విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ కే ఇండియన్ మార్కెట్ లో అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత మరో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో వాడి వాసలై అనే సినిమా ఉంటుంది. ఇది ఈ యేడాదే ప్రారంభం అవుతుంది. అటు లోకేష్ ఇప్పుడు లియో మూవీ చేస్తున్నాడు. అక్టోబర్ 19న విడుదల కాబోతోందీ సినిమా. తర్వాత ఖైదీకి కొనసాగింపుగా కార్తీతో సినిమా ఉంటుంది. ఇటు సూర్య వాడి వాసలై, లోకేష్ ఖైదీ2 పూర్తి చేసిన తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. మొత్తంగా ఎల్.సి.యూలోకి సూర్య కూడా అడుగుపెడుతున్నాడు.

Related Posts