స్టార్ హీరోయిన్ భర్తతో దిల్ రాజు భారీ సినిమా

తెలుగు నుంచి ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఈ ట్రెండ్ ను కొన్నాళ్ల క్రితమే స్టార్ట్ చేశాడు. అలా బాలీవుడ్ లో రీమేక్ చేసిన తెలుగు జెర్సీకి అక్కడ మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇటు తమిళ్ లో ఎంట్రీ ఇచ్చిన వారసుడు తెలుగులో పోయినా.. అక్కడ విజయ్ ఇమేజ్ వల్ల మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో అంజలి, సునిల్, సూర్య తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ అనుకున్నంత సజావుగా సాగడం లేదు. ఆ మధ్య శంకర్ బిజీగా ఉండటంతో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను హిట్, హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలనుతో చేయించాడు. ప్రస్తుతం శైలేష్‌ .. వెంకటేష్‌ హీరోగా సైంధవ్ అనే చిత్రం చేస్తున్నాడు. అయితే దిల్ రాజు పర్టిక్యులర్ గా శైలేష్‌ నే ఎందుకు తీసుకున్నాడు అనే అనుమానం అప్పట్లో అందరికీ కలిగింది.

బట్ అది అతనికి ఓ టెస్ట్ షూట్ లాంటిది అని తర్వాత అర్థమైంది. యస్.. శైలేష్ డైరెక్షన్ స్టైల్ తన స్టైల్ కు దగ్గరగా ఉంటుందా లేదా అనే టెస్ట్ కోసమే అతనికి గేమ్ ఛేంజర్ బాధ్యతలు ఇచ్చాడు. ఆ విషయంలో శైలేష్ సక్సెస్ అయ్యాడు. దీంతో దిల్ రాజు ఈ దర్శకుడికి ఓ భారీ సినిమా ఆఫర్ చేశాడు. అది కూడా గేమ్ ఛేంజర్ హీరోయిన్ భర్త అయిన సిద్ధార్థ్ మల్హోత్రాతో కావడం విశేషం.


సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఓ శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ప్లాన్ చేసుకున్నాడు దిల్ రాజు. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే శైలేష్ ఇప్పటికే ఆ జానర్ లో ఎక్స్ పర్ట్ అయ్యాడు అని చెప్పాలి. సో.. ఈ సారి ఇంకాస్త ఇంటెన్సిటీ ఉన్న స్టోరీతోనే వస్తాడు. పైగా దిల్ రాజు బ్యానర్ అంటే సినిమా రేంజ్ పెరుగుతుంది. ఇక ఈ మూవీతో శైలేష్ కూడా బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు అనే చెప్పాలి. ఏదేమైనా దిల్ రాజు బ్రెయినే బ్రెయిన్..

Related Posts