సలార్ కొత్త రిలీజ్ డేట్

ప్రభాస్ కొత్త సినిమా సలార్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 28న విడుదల కావడం లేదు అనేది దాదాపు ఖాయం అయింది. ఈ మేరకు అన్ని పరిశ్రమలూ ఫిక్స్ అయ్యాయి. ఆ డేట్ లో కొత్త సినిమాలు కూడా వేస్తున్నారు. కాకపోతే సలార్ వాయిదా పడింది అన్న మాట మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. అదొక్కటీ అయితే ఇక ఈ మూవీ గురించిన డిస్కషన్స్ కు కొంత గ్యాప్ పడుతుంది.

అయితే మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం కూడా అంత సులువుగా రావడం లేదు. నిజానికి అసలుఎందుకు వాయిదా పడింది అనే విషయంలోనే రకరకాల వాదనలున్నాయి.
సలార్ పోస్ట్ పోన్ అనే మాటకు ప్రధానంగా వినిపిస్తోన్న కారణం.. సి.జి వర్క్ బాగా లేకపోవడం వల్లే అని.

నిజానికి ఈ వర్క్ ను ఆల్రెడీ కోలీవుడ్ లో రిజెక్ట్ చేసిన ఒక కంపెనీకి ఇచ్చారట. వీళ్లు గతంలో రజినీకాంత్, శంకర్ కాంబోలో వచ్చిన టూ పాయింట్ ఓ(2.0) చిత్రానికి పనిచేశారు. బట్ వారి వర్క్ నచ్చకపోవడం వల్లే వారిని ప్రాజెక్ట్ నుంచి తొలగించాడు శంకర్. తర్వాత వేరే వారికి ఇచ్చాడు.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ .. శంకర్ రిజెక్ట్ చేసిన కంపెనీకే సిజి వర్క్ ఇచ్చాడట. వాళ్లు ఈ సారి కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో అవుట్ పుట్ పై ప్రభావం పడింది. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాకు ఆ క్వాలిటీ తెరపై కనిపించకపోతే రిజల్ట్ లో కూడా భారీ మార్పులు వస్తాయి.

ఆల్రెడీ ప్రభాస్ కు ఆదిపురుష్‌ వంటి బిట్టర్ ఎక్స్ పీరియన్స్ ఉంది. అయినా సలార్ కూడా అలాగే వస్తే అతని ఇమేజ్ కూడా డామేజ్ అవుతుంది. పైగా ప్రశాంత్ నీల్ సినిమా అంటే కూడా కొన్ని అంచనాలున్నాయి. వాటినీ అందుకోవాలి. కాంబినేషన్ క్రేజ్ నూ రీచ్ కావాలి. అంటే క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకే ఆలస్యం అనేది క్లియర్.

అదే టైమ్ లో కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తారు అనే టాక్ కూడా ఉంది. ఇలాంటి పెద్ద సినిమాలు వాయిదా పడగానే ఫస్ట్ వచ్చే టాక్ అదే. బట్ ఈ మూవీకి సంబంధించి రీ షూట్ వంటివి ఏమీ ఉండవు అనే చెబుతున్నారు. నిజానికి షూటింగ్ బానే అయింది. పోస్ట్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లమ్ అంతా అనేది శాండల్ వుడ్ టాక్.


సో.. ఇప్పుడు ఎవరెన్ని చెప్పినా సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కావడం లేదు అనేది క్లియర్. మరి కొత్త డేట్ ఎప్పుడు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా రెండు డేట్స్ వినిపిస్తున్నాయి. ఒకటి నవంబర్ 24న విడుదల కావొచ్చు అనేదొ ఒక డేట్. లేదా డిసెంబర్ 15న అనేది మరో డేట్. ఈ రెండు డేట్స్ లో లేదా నవంబర్, డిసెంబర్ లో ఏదో ఒక డేట్ లో రావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.

అయితే ఇప్పుడు ఈ డేట్స్ కమిట్ అయ్యి.. ఆ తర్వాత వర్క్ కంప్లీట్ కాకపోతే మళ్లీ సమస్య అవుతుంది. అందుకే కొత్త రిలీజ్ డేట్ విషయంలో తొందరపడి అనౌన్స్ చేయాలనుకోవడం లేదు టీమ్. మరి ఈ రెండు డేట్స్ దాటితే సమ్మర్ వరకూ ఆగాల్సి వస్తుంది. కాబట్టి.. నవంబర్ లేదా డిసెంబర్ లోనే పక్కాగా వస్తుందనేది లేటెస్ట్ న్యూస్..

Related Posts