మత్స్యకన్య గా మారిన అవికా గోర్

చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెరపై పరిచయమై.. ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్ గా సెటిలైన బ్యూటీ అవికా గోర్. మొదట్లో ‘సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ’ వంటి వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న అవిక.. ఆ తర్వాత అదే దూకుడు చూపించలేదు. ఒకానొక దశలో బొద్దుగుమ్మ అనే ఇమేజ్ ను మూటగట్టుకుంది. ఆ తర్వాత బాగా స్లిమ్ అయ్యి.. నయా అవతార్ లో మెస్మరైజ్ చేసి.. మళ్లీ అవకాశాలు పట్టేసింది.

లాస్ట్ ఇయర్ ‘పాప్‌కార్న్, 1920.. హారర్స్ ఆఫ్ ది హార్ట్, ఉమాపతి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే.. ఇవేమీ ఆడియన్స్ ను అలరించలేకపోయాయి. ప్రస్తుతం అవికా కిట్టీలో ‘బ్లడీ ఇష్క్’ అనే హిందీ సినిమా ఒక్కటే ఉంది. ఇక.. కొత్త అవకాశాల కోసం అమ్మడు మళ్లీ గ్లామర్ బాట పట్టింది. సరికొత్త ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని హీటెక్కిస్తుంది.

ఈకోవలోనే.. మత్సకన్య గా మెరిసిపోయింది అవికా. ‘నా మత్స్యకన్య ప్రపంచంలోకి అదనపు దైవత్వాన్ని జోడిస్తున్నాను’ అంటూ మత్స్య దేవతలా దిగిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో.. డీప్ క్లీవేజ్ షో తో మెర్మాయిడ్ అవతార్ లో మెస్మరైజ్ చేస్తుంది అవికా గోర్.

Related Posts