మరో కొత్త డైరెక్టర్ తో విశ్వక్ సేన్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఏ సినిమా చేసినా కాస్త కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు విశ్వక్. ఇందుకోసమే కొత్త దర్శకులను ఎంచుకుంటున్నాడా అనేలా ఉంది అతని లైనప్.

ప్రస్తుతం లిరిసిస్ట్ నుంచి డైరెక్టర్ గా మారిన కృష్ణ చైతన్యతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తోన్న ఈ చిత్రం చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో పాటు, ఫస్ట్ సాంగ్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. పాటైతే సూపర్ హిట్ అనిపించుకుంది. 1990స్ లో గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న సినిమా ఇది.


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత విశ్వక్ సేన్ మరో మూవీకి సైన్ చేసి ఉన్నాడు. వి. ఎస్ 10 అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ చిత్రంతో రవితేజ ముళ్లపూడి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. దీంతో పాటు లేటెస్ట్ గా మరో కొత్త దర్శకుడితో సినిమాకు కమిట్ అయ్యాడు విశ్వక్ సేన్.


అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి నిర్మించే ఈ చిత్రానికి శ్రీధర్ దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఇలా వరుసగా కొత్త దర్శకులతో సినిమాలు చేయడం అంటే కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు వారి నుంచి వచ్చే ఫ్రెష్ కంటెంట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం కూడా అనుకోవచ్చు. పైగా తనూ స్వయంగా రచయిత దర్శకుడు కూడా. ఏమైనా తేడాలుంటే తన ఇన్ పుట్స్ ఉండనే ఉంటాయి. ఇక ఇవి కాక గామి అనే సినిమా ఉంది. గతంలోనే స్టార్ట్ అయిన ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావడం లేదు. ఏదేమైనా విశ్వక్ సేన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ సెట్ చేసుకుంటున్నాడు.

Related Posts