మిస్టర్ శెట్టి తో కావడం లేదా

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ నెల 7న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. కాంబినేషన్ క్రేజ్ తో పాటు టైటిల్ వల్ల ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బట్ వాటిని క్యాష్‌ చేసుకునేలా మూవీ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు.

నవీన్ పోలిశెట్టి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ ప్రమోషన్స్ చేశాడు. బట్ అవేమంత ఇంపాక్ట్ చూపించలేదు అంటున్నారు. నిజానికి నవీన్ కు యూత్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ వల్ల అతను వెళ్లిచోటికల్లా కుర్రాళ్లు వచ్చారు. కేరింతలు కొట్టారు. బట్ వాళ్లు థియేటర్స్ వరకూ వస్తారా అనేదే పెద్ద ప్రశ్న.

ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా విడుదలకు ముందు ఇంకా పెద్ద బజ్ క్రియేట్ చేయడంలో ఎప్పట్లానే అలసత్వం చూపుతోందనే కమెంట్స్ కూడా ఉన్నాయి. మరోవైపు ప్రధాన పాత్రలో నటించిన అనుష్క శెట్టి అసలు ప్రమోషన్స్ కే రాను అని ఖచ్చితంగా చెప్పేసింది. కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వను అని చెప్పిందట.


దీంతో చేసేదేం లేక నవీన్ పోలిశెట్టితోనే ప్రమోషన్స్ చేయిస్తున్నారు. కానీ అతను మాత్రం ఎంతని కష్టపడతాడు. కుర్రాడు కాస్త హైపర్ యాక్టివ్ కాబట్టి అలా నగరాలన్నీ పట్టుకుని తిరుగుతున్నాడు కానీ.. లేదంటే.. ఆ ప్లేస్ లో మరో సీనియర్ హీరో ఉండి ఉంటే.. ఖచ్చితంగా నా వల్ల కూడా కాదు అనేసేవాడే. పోనీ ఇతర పాత్రలతో కూడా ప్రమోషన్స్ చేయించాలంటే వీరి తర్వాత అంత స్ట్రాంగ్ రోల్స్ ఉన్నవాళ్లే లేనట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా మిస్టర్ పోలిశెట్టి మాత్రమే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బాధ్యతను మోస్తున్నాడు.

Related Posts