‘లవ్‌ మీ’ ట్రైలర్.. దిల్‌రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న దెయ్యం కథ

ఇప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో అలరించిన నిర్మాత దిల్‌రాజు.. ఈసారి ఓ దెయ్యం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అదే ‘లవ్ మీ’. ‘ఇఫ్ యూ డేర్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. ‘రౌడీ బాయ్స్’ ఫేమ్ ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. లెజెండరీ టెక్నీషియన్స్ ఎమ్.ఎమ్.కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా.. పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో ఆకట్టుకుంటోన్న ‘లవ్ మీ’ నుంచి ట్రైలర్ రిలీజయ్యింది.

‘రోజూ రాత్రి సరిగ్గా 8 గంటలకు ఒక అలార్మ్ మ్రోగుతుంది.. అంటూ దెయ్యం గురించి హింట్ ఇస్తూ ట్రైలర్ మొదలయ్యింది. ఇక.. ఎవరైనా ఏదైనా పని చేయొద్దు అంటే అదే పని చేసే వాడుగా.. ఏదైనా డేంజర్ వెళ్లొద్దు అంటే.. అటే వెళ్లాలనిపించే మనస్తత్వం గలవాడుగా హీరోని పరిచయం చేశారు. మరి.. హీరో ఆ దెయ్యం అంతు తేల్చాడా? దెయ్యంతో అతను రొమాన్స్ చేయాలనుకోవడానికి అసలు కారణం ఏంటి? అనే ఎలిమెంట్స్ తో ‘లవ్ మీ’ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకుడు. త్వరలోనే ‘లవ్ మీ’ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుంది టీమ్. మే 25న ‘లవ్ మీ’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts