స్టార్ హీరోలు నటించే సినిమాల ఆడియో రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వారు నటించే సినిమాల ఆడియో రైట్స్ దక్కించుకునేందుకు ఆడియో సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. లేటెస్ట్ గా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.’ ఆడియో పార్టనర్ లాక్ అయ్యింది. ‘కల్కి’ ఆడియో రైట్స్ ను సరిగమ సంస్థ దక్కించుకుంది.
‘కల్కి’ ఆడియో పార్టనర్ ను ప్రకటిస్తూ ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. ఇక.. మే నెల చివరిలో ‘కల్కి’ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లా కాకుండా.. పీరియడ్ టచ్ తో సాగే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకోసం సంతోష్ నారాయణన్ కంపోజ్ చేస్తోన్న మ్యూజిక్ ఎంతో వైవిధ్యంగా ఉండబోతుందట.