జపాన్ ని పొగడ్తలతో ముంచెత్తిన రష్మిక

క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ లోని టోక్యో వెళ్లింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ఈ గ్లోబల్ ఈవెంట్ లో మనదేశం నుంచి రష్మిక రిప్రెజెంట్ చేస్తోంది. ఈ సందర్భంగా టోక్యో ఎయిర్ పోర్ట్ లో రష్మికకు జపాన్ ఫ్యాన్స్ నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించిన విషయం తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లో అభిమానులు ఇచ్చిన వెల్కమ్ తో రష్మిక ఆశ్చర్యపోయింది.

లేటెస్ట్ గా జపాన్ గురించి పలు ఆసక్తికర విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంది రష్మిక. ‘జపాన్ తాను చాలా ఏళ్లుగా వెళ్లాలని కలలు కన్న ప్రదేశం అని.. ఇది సాధ్యమవుతుందని ఎప్పుడూ అనుకోలేదని.. ఇక్కడ ప్రతి ఒక్కరినీ కలుసుకోవడం.. ఇక్కడ అపురూపమైన ప్రేమను అందుకోవడం.. ఇంతటి ఘనస్వాగతం అందుకోవడం.. చాలా బాగుందని’ తన పోస్ట్ లో తెలిపింది. ఇంకా.. ‘జపాన్ లోని ఆహారం, వాతావరణం, ప్రదేశాలు చాలా పరిశుభ్రంగా ఉండడం.. ఇంత మనోహరమైన మనుషులు.. అద్భుతం!’ అంటూ జపాన్ ని పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది.

Related Posts