‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే ఫోటోలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్స్ ను రెగ్యులర్ గా రిపీట్ చేస్తుంటాడు. ఈకోవలోనే ‘అరవింద సమేత, అల.. వైకుంఠపురములో’ భామ పూజా హెగ్డేను ‘గుంటూరు కారం’ కోసం తీసుకున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల పోషించిన పాత్రకే పూజా హెగ్డే ఎంపికయ్యింది. మీనాక్షి చౌదరి రోల్ కోసం శ్రీలీలను తీసుకున్నారు. ‘గుంటూరు కారం’ చిత్రంకోసం పూజా హెగ్డేతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

హీరో మహేష్ బాబు.. మేనత్త పాత్రలో కనిపించిన ఈశ్వరిరావులతో పాటు.. శ్రీలీల, పూజా హెగ్డే కలిసి సందడి చేస్తోన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సినిమాకోసం మహేష్ బాబుతో కొన్నిరోజుల షూటింగ్ లోనూ పాల్గొన్న పూజా హెగ్డే.. వేరే సినిమాలతో డేట్స్ క్లాష్ అయ్యాయనే కారణంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.

Related Posts