రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్ స్టార్ అయింది..

ఈ మధ్య కాలంలో బాగా లేట్ అవుతున్న స్టార్ హీరో సినిమా అంటే రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్ నే చెప్పాలి. శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత శంకర్ అనివార్యంగా భారతీయుడు2 తీయాల్సిందే అన్న పరిస్థితి వచ్చింది. దీంతో గేమ్ ఛేంజర్ ఆగింది. అప్పుడప్పుడూ సా.. గుతూ వస్తోంది.

జూన్ 20న రామ్ చరణ్‌ కు కూతురు జన్మించిన తర్వాత అతనూ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇక మధ్యలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను హిట్ మూవీస్ డైరెక్టర్ శైలేష్ కొలను తో తీయించాడు దిల్ రాజు. అయినా ఫ్యాన్స్ లో ఒక అసంతృప్తి ఉంది. గేమ్ ఛేంజర్ ఉందా లేదా అనే మీమాంసలో ఉన్నారు. వారికోసమే ఈ వార్త.


గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ఈ మంగళవారం నుంచి హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. నిజాంపేటతో పాటు అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్, నిజాం కాలేట్ లాంటి లొకేషన్స్ లో ఏకధాటిగా రెండు వారాల పాటు షూటింగ్ జరగబోతోంది. ఈ షెడ్యూల్ లో మెయిన్ ఆర్టిస్టులంతా ఉండబోతున్నారు.

హీరోయిన్ కియారా అద్వానీతో పాటు ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, సునిల్, జయరాం లాంటి కీలక ఆర్టిస్టులు షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒకటి సివిల్ సర్వెంట్(కలెక్టర్) గా మరోటి పొలిటీషియన్ గా ఉంటుంది అంటున్నారు. ఈ సివిల్ సర్వెంటే పాలిటిక్స్ లోకి వెళతాడా లేక ద్విపాత్రాభినయమా అనేది తెలియాల్సి ఉంది. దీంతో పాటు ఈ షెడ్యూల్ ను డైరెక్ట్ చేస్తున్నది శంకరా లేక శైలేష్‌ కొలనా అనేది కూడా డైలమానే. మొత్తంగా గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ తో పూర్తి చేసుకోబోతోంది.

Related Posts