కష్టాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

తెలుగులో మొదటి నుంచీ ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. టిజి విశ్వ ప్రసాద్ స్థాపించిన ఈ కంపెనీ నుంచి వరుసగా సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. చిన్న, పెద్ద హీరోలతో పాటు, సీనియర్స్ అండ్ న్యూ డైరెక్టర్స్ కూ అవకాశాలిస్తూ టాలీవుడ్ లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.

ఈ బ్యానర్ లో వారికి ఇప్పటికే కొన్ని మెమరబుల్ హిట్స్ ఉన్నాయి. అయితే 2023 మాత్రం వారికి అంతగా కలిసి రావడం లేదు.ఈ యేడాది వారు చేసిన అన్ని ప్రాజెక్ట్స్ నష్టాలనే తెస్తున్నాయి.2023లో నాగశౌర్య,మళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో నిర్మించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్ర ఫ్లాప్ అయింది.


ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాల మధ్య రూపొందించిన రామబాణం గురి తప్పింది. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ డైరెక్టర్.మంచి డేట్ కూడా చూసుకుని వచ్చిన రామబాణం బిగ్ డిజాస్టర్ అయింది. నిజానికి ఈ మూవీపై నిర్మాతలతో పాటు హీరో, దర్శకుడు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ చూపించారు. బట్ సినిమా పోయింది. పీపుల్ మీడియా వారికి భారీ నష్టాలు తెచ్చింది.


ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా చేసిన టక్కర్, ఆదిపురుష్ రెండూ నష్టాలనే మిగిల్చాయి.ముఖ్యంగా ప్రభాస్ క్రేజ్ వల్ల అయినా ఆదిపురుష్ మెప్పిస్తుందనుకున్నారు. కనీసం కమర్షియల్ గా అయినా వర్కవుట్ అవుతుందనుకున్నారు. బట్ ఈ సినిమా కూడా భారీ నష్టాలే తెచ్చింది.సిద్ధార్థ్ హీరోగా నటించిన టక్కర్ సైతం డిస్ట్రిబ్యూటర్స్ కూడా వీరికి సంతోషాన్ని మిగల్చలేదు.


ఇక లేటెస్ట్ గా వచ్చిన బ్రో.. రోజు రోజుకూ కలెక్షన్స్ పరంగా దిగజారుతోంది. 100 కోట్ల షేక్ టార్గెట్ గా విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 53కోట్ల షేర్ రాబట్టగలిగింది. కానీ మిగతాది కూడా లాగడం అసాధ్యం అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మంగళవారంఈ చిత్రానికి వచ్చిన షేర్ కేవలం కోటిన్నర మాత్రమే. పవన్ కళ్యాణ్ కు ఈ పరిస్థితి అంటే వంద కోట్లు అనే మాట అసాధ్యం కాక ఏమౌతుంది. మొత్తంగా ఈ 2023 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి అన్నీ కష్టాలే మిగిల్చేలా ఉంది.


విశేషం ఏంటంటే.. ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్న నిజాలు. కానీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాత్రం తమపై ఒక వర్గం మీడియా కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తుందని చెబుతున్నారు.ఒకవేళ బ్రో సినిమా విషయంలో అదే నిజం అనుకున్నా.. కలెక్షన్స్ మాత్రం అబద్ధం చెప్పవు కదా. ఒక రాజకీయ పార్టీ బ్రో సినిమాను ప్రభావితం చేయడం వల్ల కలెక్షన్స్ తగ్గాయి అనేది నిర్మాత ఆరోపణ. మరి ఆ పార్టీ తెలంగాణలో లేదు కదా.. సో.. ఇక్కడ కంటెంట్ తప్ప కమెంట్స్ కు వాల్యూ లేదు అనే అర్థం.

Related Posts