సౌత్ వేవ్ కు చెక్ పెట్టిన షారుఖ్

షారుఖ్ ఖాన్ సౌత్ సినిమాల హవాకు చెక్ పెట్టాడు.. అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. యస్.. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే చూపించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇండియన్ సినిమాకు కేరాఫ్ టాలీవుడ్ మారింది. మన సినిమానే ప్రపంచానికి ఇండియన్ సినిమా అనే మాటకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

మనకు తోడు కన్నడ నుంచి కేజీఎఫ్,కాంతార, తమిళ్ నుంచి విక్రమ్ వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలకు ముందే రాజమౌళి మగధీర, ఈగ, బాహుబలి మూవీస్ తో బాలీవుడ్ ను షేక్ చేశాడు. అయితే గత మూడేళ్లుగా బాలీవుడ్ కుదేలైపోయింది. కరోనా ఓ కారణమైతే సౌత్ సినిమాల ఊచకోత ఓ కారణం. ఇదే విషయాన్ని లాస్ట్ ఇయర్ రామ్ గోపాల్ వర్మ ఇలాగే విశ్లేషించాడు. అప్పట్లో ఇక బాలీవుడ్ పని అయిపోయింది అన్న కమెంట్స్ కు ఆయన ఈ రీజన్స్ చెప్పాడు.

ప్రస్తుతం సౌత్ నుంచి కేజీఎఫ్ చాప్టర్2, కాంతార, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు నార్త్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చుతున్నాయి. అందుకే బాలీవుడ్ మూవీస్ వారికి నచ్చడం లేదు అన్నాడు. బట్ ఆ మాటను పఠాన్ దాటాడు.ఈ మూవీ నార్త్ తో పాటు సౌత్ లో కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఏకంగా 1000 కోట్లు కలెక్ట్ చేసింది.


ఇదే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ మళ్లీ చెబుతున్నాడు. పఠాన్ నార్త్ లో సౌత్ సినిమాల హవాకు చెక్ పెట్టింది అంటున్నాడు. పఠాన్ హిందీ హీరో, హిందీ దర్శకుడు, హిందీ నిర్మాత చేసిన సినిమా. అయినా అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అంటే మళ్లీ వాళ్లకువాళ్ల సినిమాలే నచ్చడం మొదలైంది. అందువల్ల మన సినిమాకు కొంత గ్యాప్ వస్తుదని విశ్లేషిస్తున్నాడు.

అయినా ఇక్కడ వేవ్ అనేది ఆడియన్స్ కు నచ్చడాన్ని బట్టి ఉంటుంది కానీ.. సౌత్, నార్త్ అన్న బారికేడ్స్ లో కాదంటున్నాడు. మరి అదే నిజమైతే.. పఠాన్ తర్వాత వచ్చిన బాలీవుడ్ మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ కావాలి కదా అంటారేమో.. అదే వర్మ చెబుతున్నది. ఇక్కడ కంటెంట్ ఇంపార్టెంట్ అంటున్నాడు.కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఒక వేవ్ కు కొంతకాలం పాటు చెక్ పెడతాయి.

అలా షారుఖ్ ఖాన్ పఠాన్ తో సౌత్ వేవ్ కు కొంత చెక్ పెట్టాడు. జవాన్ తో అది మరింత పెరుగుతుంది అనేది అతని విశ్లేషణ. అది ఎలా ఉన్నా.. సౌత్ సినిమాలకు కొన్నాళ్లుగా నార్త్ లో తిరుగులేని ఆదరణ ఉంటోంది. అందుకే మనం ఫ్లాప్ అన్న సాహోను వాళ్లు నెత్తిన పెట్టుకున్నారు. బట్ వర్మ చెప్పిన మాటల్లో కూడా కొంత నిజం లేకపోలేదు అనిపిస్తోంది కదూ..

Related Posts