ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి..

సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ట్ డైరెక్టర్ గా అద్భుతమైన ప్రతిభను చూపించిన నితిన్ దేశాయ్ అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు. ఈయన బాలీవుడ్ లో చాలా ఫేమస్. తెలుగు వారినీ ఆకట్టుకున్న లగాన్, జోధా అక్బర్ చిత్రాల ఆర్ట్ డైరెక్టర్ ఇతనే.

ముంబైలోని కర్జాత్ లో ఉన్న తన స్టూడియోలోనే ఆయన చనిపోయి ఉన్నారు.పోలీస్ లు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నితిన్ దేశాయ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా పరిశ్రమలో ప్రవేశించారు.

1942 ఏ లవ్ స్టోరీ, స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2005లో సొంతంగా స్టూడియో స్థాపించుకున్నారు. ఆయనకు సంబంధించి బెస్ట్ ఆర్ట్ వర్క్ అంటే లగాన్, సల్మాన్ ఖాన్ నటించిన హమ్ దిల్ దే చుకే సనమ్, జోధా అక్బర్, దేవదాస్, డాక్టర్ బాబాసాహె అంబేద్కర్ వంటి చిత్రాలు తిరుగులేని పేరు తెచ్చాయి.


వీటిలో లగాన్, హమ్ దిల్ దే చుకే సనమ్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్,దేవదాస్ చిత్రాలకు బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన చివరి సినిమా పానిపట్. అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అర్జున్ కపూర్, కృతి సనన్ నటించారు. నితిన్ దేశాయ్ మృతి పట్ల బాలీవుడ్ తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. అయితే ఇది ఆత్మహత్య, హత్యా అనేది ఇంకా తేలాల్సి ఉండటం మరింత విషాదకరం.

Related Posts