రీమేక్స్ తో పవన్ కళ్యాణ్‌ డబుల్ హ్యాట్రిక్

పవన్ కళ్యాణ్‌ కెరీర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలే ఉన్నాయనేది నిజం. ఆయన కెరీర్ ఆరంభం నుంచీ రీమేక్ లే ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషీ, అన్నవరం, తీన్ మార్, గబ్బర్ సింగ్, గోపాలా గోపాలా, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు.. ఇవన్నీ అతను చేసిన రీమేక్ సినిమాలే. అయితే కెరీర్ ఆరంభంలో గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషీ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టాడు పవన్ కళ్యాణ్‌. మళ్లీ ఇన్నాళ్లకు రీమేక్ లతో హ్యాట్రిక్ పూర్తయింది. ఫస్ట్ హ్యాట్రిక్ తో పోలిస్తే ఇప్పుడు అతని ఇమేజ్ వేరే. రేంజ్ వేరే. అలాగే వీటి కమర్షియల్ సక్సెస్ లు కూడా నెక్ట్స్ లెవల్ గానే ఉన్నాయి.

ఇక చివరగా చేసిన వాటిలో వకీల్ సాబ్ బాలీవుడ్ లో వచ్చిన పింక్ చిత్రానికి రీమేక్. అక్కడ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేశాడు. ఇదే సినిమాను తమిళ్ లో అజిత్ చేశాడు. తెలుగులో పవన్ ఇమేజ్ కోసం చాలా మార్పులు చేశారు. అక్కడ ఇంటెన్స్ డ్రామాగా ఉన్న సినిమా ఇక్కడ కమర్షియల్ డ్రామాగా మారింది.


ఇక నెక్ట్స్ వచ్చిన సినిమా భీమ్లా నాయక్. మళయాలంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ ఇది. మళయాలంలో పృథ్వీరాజ్, బిజు మీనన్ నటించారు. తెలుగులో పవన్ కళ్యాణ్‌ – రానా నటించారు. మళయాలంతో పోలిస్తే పవన్ క్యారెక్టరైజేషన్ మార్పులు జరిగాయి. కానీ మెయిన్ థీమ్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇక క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ మళయాంలో లేదు. అందుకోసం మధ్యలో ఒక ఫైట్ సీన్ కూడా పెట్టారు. ఇదీ పెద్ద విజయమే సాధించింది. అప్పట్లో వైఎస్ జగన్ ఈ చిత్రాన్ని అనధికారికంగా వేధించాడు. అందువల్ల కొన్ని రికార్డ్స్ మిస్ అయ్యాయని చెబుతారు.


ఇక లేటెస్ట్ గా వచ్చిన బ్రో మూవీ కూడా తమిళ్ లో వచ్చిన వినోదాయ సీతాకు రీమేక్. అక్కడ సముద్రఖని ప్యూర్ లీ ఓటిటి కంటెంట్ గానే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్‌ కోసం కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిపోయింది. నిజానికి ఇది ఎమోషనల్ గా చెప్పాల్సిన కథ. దీనికి చాలా కమర్షియల్ పూతలు పూయడంతో కొంత వరకూ అసలు కంటెంట్ తేలిపోయింది. కానీ పవన్ కళ్యాణ్‌ అభిమానులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయం సాధించే అవకావాలున్నాయి. మొత్తంగా కెరీర్ ఆరంభంలో ఆ హ్యాట్రిక్.. ఇప్పుడు ఈ హ్యాట్రిక్. మరి ఇంకా ఎన్ని హ్యాట్రిక్ లు ఉంటాయో..

Related Posts