టిఎఫ్.సి.సి ఎలెక్షన్స్ పై దిల్ రాజు ప్యానెల్ ప్రెస్ మీట్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. సి కళ్యాణ్‌, దిల్ రాజు ప్యానల్స్ బరిలో ఉన్నాయి. మరి కొన్ని గంటల్లోనే జరగబోతోన్న ఈ ఎన్నికలకు సంబంధించి దిల్ రాజు తన ప్యానెల్ తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..
“దిల్ రాజు ప్యానెల్ ద్వారా మీడియాకు నమస్కారం. రేపు(ఆదివారం)తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎలెక్షన్స్ జరుగుతున్నాయి. మా ప్యానెల్ లో పెద్ద, చిన్న సినిమాలు తీస్తున్న ప్రొడ్యూర్స్ అందరూ కలిపి దిల్ రాజు ప్యానల్ గా.. ప్రొడ్యూసర్ సెక్టార్, ప్రొడ్యూసర్ ఈసీ, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ కు మా ప్యానెల్ ద్వారా ఎలక్షన్ లో పాల్గొనబోతున్నాం. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందనే అందరికీ తెలుసు. ఈ ఎలక్షన్స్ లో మా వ్యూస్ చెప్పాలనుకుంటున్నాం. మాకు కాంట్రవర్శీస్ ఏం లేవు. ఛాంబర్ ను బలోపేతం చేస్తూ ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అభిప్రాయంతో వెళుతున్నాం. ఛాంబర్ లో నాలుగు సెక్టార్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్. ఈ నాలుగు సెక్టార్స్ నుంచి అందరూ వస్తే.. చాంబర్ అనేది ఇండస్ట్రీకి మదర్. ఏ సమస్య ఉన్నా ఛాంబర్ సుప్రీమ్. అందుకే ఎక్కువ సినిమాలు తీస్తున్న ఎక్స్ పీరియన్స్ డ్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనే వచ్చాము.

ఈ నాలుగు సెక్టార్స్ లో అన్ని సెక్టార్స్ కు సమస్యలుంటాయి. మా ప్యానెల్ లో ఎక్స్ పీరియన్స్ డ్ యాక్టివ్ వాళ్లు ఉన్నారు. అంటే సినిమాలు తీస్తున్నవాళ్లు, స్టూడియోస్ వారు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ ఉన్నారు. ఒక రకంగా దిల్ రాజు ప్యానెల్ అనేది యాక్టివ్ ప్యానెల్. ప్రతి సెక్టార్ కూడా వ్యాపారంతో కూడుకున్నది. అందరూ చేసేది వ్యాపారమే. ఎంత క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నా అల్టిమేట్ గా వ్యాపారమే లక్ష్యం. ఈ నాలుగు సెక్టార్స్ కలిస్తేనే సినిమాకు సంబంధించిన అన్నీ జరుగుతాయి. ఇతర రంగాల్లో ఎన్ని అసోసియేషన్స్ ఉన్నా.. అన్నిటికీ బేస్ ఛాంబర్. అందుకే మేము ప్రత్యేకంగా ఎలెక్షన్స్ కు ప్రాపర్ టీమ్ గా వెళ్లాలనుకున్నాం. కోవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకటే. చిన్నవే అయినా సామజవరగమన, బేబీ సినిమాలు ఇండస్ట్రీకి ఊపు తెచ్చాయి. ఇలా మంచి సినిమాలను ప్రేక్షకుల వరకూ తీసుకువెళ్లేలా మా ప్యానెల్ పనిచేస్తుంది. మంచి ఐడియాస్ తో ఛాంబర్ ఎలెక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం.


ఇక నాలుగు సెక్టర్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ చూస్తే.. ఎగ్జిబిటర్స్ కు సంబంధించిన సమస్యలున్నాయి. వాళ్ల సమస్యలు ప్రభుత్వంతో సమస్యలున్నాయి. వారికి అవసరమైన ఫెసిలిటీస్ ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకుని రావాలి. అలా చేయడానికి మా దగ్గర ప్రాపర్ టీమ్ ఉంది. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను సాల్వ్ చేస్తాం.


డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లోనూ సమస్యలున్నాయి. డిస్ట్రిబ్యూషన్ అంటే వ్యాపారం. లాభాలు, నష్టాలు ఉంటాయి తప్ప సమస్యలు ఎక్కువగా ఉండవు. ఎగ్జిబిటర్స్ తో పోలిస్తే డిస్ట్రిబ్యూటర్స్ కు సమస్యలు తక్కువ.
తర్వాత ప్రొడ్యూసర్స్ కు సమస్యలు చాలా ఉన్నాయి. చాలా చిన్న సినిమాలు రెడీ అయ్యి రిలీజ్ కాకుండా ఉండిపోయాయి. డిజిటల్, క్యూబ్, యూఎఫ్ఓ సమస్యలు అలాగే ఉండిపోయాయి. ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని పర్మిషన్స్ అలాగే ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ఓ ప్రణాళిక వేసుకుని సమస్యలను ఎలా పరిష్కరించాలనేదానికి మేం సరైన టీమ్ తో ఉన్నాము. ఇవన్నీ ఛాంబర్ ద్వారానే అన్ని సెక్టార్స్ సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నాము. దీంతో పాటు ఫెడరేషన్ సమస్యలు కూడా. ఫెడరేషన్ తో అనుసంధానం చేసుకుని ఎవరికీ ఎవరితో సమస్యలు లేకుండా చేయాల్సి ఉంది. మరోవైపు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారితో సమస్యలు. వారి ఇష్యూస్ ను కూడా చాంబర్ వేదికగానే పరిష్కరించాలనుకుంటున్నాం. ప్రాపర్ గా ఇండస్ట్రీని స్ట్రెంతెన్ చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఎక్కడో ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలనేది మా ఆలోచన.


ఎగ్జిబిటర్స్ అన్నీ యూనానిమస్ అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఏరియాల వారీగా వస్తున్నారు. వీళ్లు 80శాతం యాక్టివ్ గా ఉన్నవాళ్లను, పాతవాళ్లను కూడా కొందరిని అనుభవం కోసం తీసుకుంటున్నాం. ప్రొడ్యూసర్స్ కూడా అంతే. 12 మంది ఈసీ ఎంబర్స్. 20 స్టూడియో సెక్టర్స్ లో ఉన్నాం. ఇంతమందిని టీమ్ గా తయారు చేసి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జరగబోతోన్న ఎలెక్షన్స్ లో మా టీమ్ పోటీ చేయబోతోంది. ఈ సందర్భంగా తెలుగు స్టేట్స్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్ లో ఓటు వేయబోతోన్న వారితో పాటు ఆల్ ప్రొడ్యూసర్స్ కు మా మనవి ఏంటంటే.. 1500 మంది ప్రొడ్యూసర్స్ లిస్ట్ అవుట్ అయ్యి ఉన్నారు. కానీ యాక్టివ్ గా ఉన్నవాళ్లు 150మంది వరకూ మాత్రమే ఉన్నారు. ఈ మొత్తంలో 750 – 800 మంది ఓటింగ్ కు వస్తారనుకుంటున్నాం. అందరికీ మా విన్నపం ఒకటే.. సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే ఎవరు రైట్, ఇక్కడి సమస్యలు పరిష్కారం కావాలంటే ఎవరైతే బెటర్ అని మీరు అనుకుంటారో.. ఈ రాత్రి పడుకోబోయే ముందు మీరంతా ఒకసారి ఆలోచించి మీ మనస్సాక్షికి తగ్గట్టుగా ఓటు వేస్తారని ఆశిస్తున్నాం.. ” అన్నాడు.

Related Posts