ఎన్టీఆర్ మాఫియాలో కాదు.. యుద్ధంలో ఉంటాడు..

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఎంచుకునే కథల్లో పూర్తిగా ఒక వైవిధ్యం కనిపిస్తోంది. ఈ మూవీతో ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తను ఓ గొప్ప నటుడుగా పరిచయం అయ్యాడు. అదే సమయంలో పొటెన్షియల్ ఉన్న మాస్ హీరోగానూ కనిపించాడు. డ్యాన్సుల్తో దుమ్ములేపుతాడు అని కూడా అనిపించాడు. ఈ విషయాన్ని ఇండియన్ ఆడియన్స్ అతని డబ్బింగ్ సినిమాల రూపంలో ముందే తెలుసు. బట్ ఆర్ఆర్ఆర్ ఇచ్చిన కిక్ వేరే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ ను బిగ్ స్పాన్ లో చూడాలనుకుంటున్నారు.

ఎన్టీఆర్ కూడా అదే చేస్తున్నాడిప్పుడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ మేకోవర్, కొరటాల మేకింగ్.. మరోసారి కంట్రీని షేక్ చేస్తాయని చెబుతున్నారు. ఆ తర్వాత డైరెక్ట్ గా వార్ లోకే దిగబోతున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ వార్2 మూవీలో నటించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సౌత్ ఇండియన్ ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఇప్పటికి ఎదురుచూస్తోన్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా గురించే ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి.


ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 2022లోనే స్టార్ట్ అవుతుందనుకున్నారు. అప్పటికి ఆర్ఆర్ఆర్ పూర్తి కాకపోవడం వల్ల ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. లేదంటే సలార్ ప్లేస్ లో ఎన్టీఆర్ సినిమానే ఉండేది. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ప్యాన్ ఇండియన్ లెవల్లో మార్కెట్ క్రియేట్ అయింది. ఆ మార్కెట్ ను కొరటాల శివ సినిమా మరింత పెంచుతుంది. వార్2 నెక్ట్స్ లెవల్ కు వెళుతుంది. ఇటు ప్రశాంత్ నీల్ కూడా సలార్ రెండు భాగాలతో కంట్రీని షేక్ చేస్తాడు. అప్పుడు ఎన్టీఆర్ తో సినిమా పడితే ఎట్టా ఉంటుంది..?


అయితే ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ చేసిన సినిమాలు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నాయి. మాగ్జిమం మాఫియా చుట్టూ తిరిగాయి. బట్ ఎన్టీఆర్ సినిమా మాఫియా నుంచి పూర్తిగా బయటకు వస్తుంది. ఇదో ఫ్రెష్ కంటెంట్ అంటున్నారు. ఇంకా చెబితే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మూడు యుద్ధాల గురించే అందరికీ తెలుసు. కానీ విడిపోతోన్న టైమ్ లో జరిగిన కొన్ని సంఘటనలు.. సరిహద్దులో సాగిన యుద్ధాలు, దోపిడీలు నేపథ్యంలో ఈ కథ ఉంటుందట.

అంతే కాదు. ఇది కేవలం ఒకే పార్ట్ లో పూర్తవుతుందని కూడా చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా వచ్చే టైమ్ కు పార్ట్1, పార్ట్2 తరహా ట్రెండ్ కు కూడా ఫుల్ స్టాప్ పడుతుందనే అంచనాలున్నాయి. అలా పడ్డా పడకపోయినా.. ఎన్టీఆర్ మాత్రం మాఫియాలో కాకుండా యుద్ధ రంగంలో కనిపించబోతున్నాడు అనేది అభిమానులకు కాస్త ఊరట కలిగించే విషయమే. లేదంటే ప్రశాంత్ నీల్ మళ్లీ కేజీఎఫ్ లో మిగిలిపోయిన షాట్స్ ను సలార్ లో వాడినట్టు.. సలార్ లో మిగిలిన షాట్స్ ను ఎన్టీఆర్ కు వాడతాడు.

Related Posts