శ్రీకాంత్ కొడుక్కి బలే ఛాన్స్ వచ్చిందే..

శ్రీకాంత్ .. వంద సినిమాలు పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. వీటిలో అతను విలన్ గా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. హీరోగా చేసిన వందో సినిమా మహాత్మా కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాకపోయినా.. విమర్శీయల్ గా మంచి అప్లాజ్ వచ్చింది.

బట్ ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆకట్టుకోలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా చేస్తున్నాడు. ఇక హీరోగా తనకు తిరుగులేని బ్రేక్ ఇచ్చిన రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలోనే తన కొడుకు రోషన్ ను హీరోగా రీ లాంచ్ చేశాడు.

పెళ్లి సందడి అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అనిపించుకుంది. బట్ రోషన్ కే నెక్ట్స్ ప్రాజెక్ట్ వెంటనే పడలేదు. మధ్యలో మేకోవర్ కోసం కొంత ప్రయత్నాలు చేశాడు. అయినా కొత్త సినిమా విషయంలో ఓ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అయితే ఫైనల్ గా అతను కూడా ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి.


ప్రదీప్ అద్వైతం అనే దర్శకుడు రూపొందించబోతోన్న ఈ సినిమా పీరియాడిక్ ఫాంటసీ డ్రామాగా రాబోతోందట. కాస్త అటూ ఇటూగా మగధీర టైప్ లో రెండు జన్మలు అనే వృత్తాంతం ఉంటుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

అయితే ఈ మూవీలో ప్యాన్ ఇండియన్ టైటిల్ కు తగ్గట్టుగా భారీ తారాగణం మాత్రం ఉంటుందట. అందులో భాగంగా ఫస్ట్ ఆర్టిస్ట్ గా మోహన్ లాల్‌ ను ఒప్పించారు అనే మాటలు వినిపిస్తున్నాయి. మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్ తోడుంటే రోషన్ ప్యాన్ ఇండియన్ లెవల్లో ఖచ్చితంగా పాస్ అయిపోతాడు. కాకపోతే కంటెంట్ కూడా ఆ