నాని.. ఇదేం ట్విస్ట్ నాన్నా..

నేచులర్ స్టార్ నాని ఓ కథ ఎంచుకున్నాడు అంటే ఖచ్చితంగా ఓ మంచి పాయింట్ ఉంటుందనే నమ్ముతారు ఆడియన్స్. రిజల్ట్ తో పనిలేకుండా అతను మాత్రం ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం తన కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి 30వ సినిమా చేస్తున్నాడు. చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ” హాయ్ నాన్న” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ మాత్రం సర్ ప్రైజింగ్ గా ఉంది. నాని వీడియోగ్రాఫర్ గా కనిపిస్తున్నాడు.

లేదా ఏదైనా ఫిల్మ్ మేకర్ అయి ఉంటాడు అనిపిస్తోంది. అయితే అతని కూతురు ఉంటుంది. తనే ఈ గ్లింప్స్ లో ప్రధాన పాత్రలను పరిచయంం చేస్తుంది. ఆ పాపకు ఓ ఫ్రెండ్ ఉంది. పేరు యష్ణ. తనే మృణాల్ ఠాకూర్. మా నాన్న అనగానే నాని కనిపిస్తాడు. ఈ లుక్ లో నాని చాలా నేచురల్ గా ఉన్నాడు. ముంబై వీధుల్లో వెళుతూ అతను ఇచ్చిన ఓ లుక్ చూస్తే నానిని ఎందుకు బెస్ట్ యాక్టర్ అంటామో మరోసారి అర్థం అవుతుంది. బట్ ఈ గ్లింప్స్ లో సర్ ప్రైజింగ్ ఏంటంటే.. మృణాల్ ఠాకూర్ ను తన తండ్రికి పరిచయం చేస్తుంది అతని కూతురు. మృణాల్ మాత్రం హాయ్ నాన్న అంటూ పరిచయం చేసుకుంటుంది.

అంటే దీన్ని బట్టి ఆ పాపకు తన తండ్రి అంటే ఎంత ఇష్టమో.. అర్థం చేసుకోవచ్చు. ఆ పాప పదే పదే మా నాన్న మా నాన్న చెప్పడం వల్ల ఆ నాన్నను చూడాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ కలిగేలా.. అందరూ కూడా అతన్ని హాయ్ నాన్న అని పిలుచుకునేంత బంధం ఈ తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక గ్లింప్స్ తో పాటు వినిపించిన ఆర్ఆర్ హార్ట్ టచింగ్ గా ఉంటే బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన సాంగ్ బ్రీజీగా ఉంది.

ఇక శౌర్యువ్ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అతను నాని స్ట్రెంత్ కు తగ్గ కథతో వస్తున్నాడని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న సినిమా ఇది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన ఇతను ఇప్పటి వరకూ మళయాలంలో మంచి మ్య�