కుమారి శ్రీమతిగా నిత్య మీనన్

ఒకప్పుడు తెలుగు సినిమాలతోనే ఫేమ్ అయింది నిత్య మీనన్. అలా మొదలైంది సినిమాతో బ్రేక్ తెచ్చుకుంది. ఆ బ్రేక్ తోనే ఇతర భాషల్లో కూడా ఆఫర్స్ అందుకుంది. అఫ్‌కోర్స్ తెలుగు కంటే ముందు మళయాలంలో మెరిసింది. బట్ స్టార్డమ్ వచ్చింది మాత్రం ఇక్కడే. అలాంటి నిత్య కొన్నాళ్లుగా తెలుగు తెరకు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు అమ్మడు బాగా లావు కావడంతో తెలుగువాళ్లూ పట్టించుకోలేదు. బట్ అదే ఫిజిక్ తో ధనుష్ సరసన తిరు అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ మెప్పించింది. మరోవైపు బాలీవుడ్ లోనూ నటిస్తోన్న నిత్య మీనన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులోకి ఎంటర్ అయింది.


కొన్నాళ్ల క్రితం స్వప్న సినిమాస్ బ్యానర్ పై రూపొందిన మహానటి సినిమాలో ముందుగా సావిత్రి పాత్రకు అనుకున్నది నిత్యనే. కానీ తను స్క్రిప్ట్ లో మార్పులు చెప్పింది. అందుకే అశ్వనీదత్ వద్దనేశాడు. తర్వాత కీర్తి సురేష్‌ ఆ సినిమా చేసి నేషనల్ అవార్డ్ అందుకుంది. అప్పుడు ఇద్దరికీ కుదరకపోయినా మళ్లీ స్వప్న సినిమా బ్యానర్ తోనే నిత్య మీనన్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కుమారి శ్రీమతి అనే వెరైటీ టైటిల్ పెట్టారు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో వినిపించిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.. “అబ్దుల్ కలామ్ అంట రజినీకాంత్ అంట.. తర్వాతేమో ఈవిడేనంటా.. ఉజ్జోగం సజ్జోగం చేయదంట.. బిజినెస్సే చేత్తదంటా.. కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కొత్తదంటా.. పెళ్లి గిల్లీ ఒద్దంటొదినోయ్.. ఇట్టానే ఉండిపోద్దంటా.. ” అంటూ ఒక గొంతు నిష్టూరంగా అంటుంటే.. మరో గొంతు.. ఎవరి గురించొదినా నువ్వు మాట్లాడేది అంటుంది.. దానికి ” ఉందిగా ఆ దేవికమ్మ పెద్ద కూతురు.. ” అంటుంది. అట్నుంచి ‘ఓహో శ్రీమతా’ అంటే ” ఆ కుమారి శ్రీ.. మతి’ అంటూ సాగదీస్తుంది మరో గొంతు. మరి కుమారి శ్రీమతి మధ్య ఉన్న మేటర్ ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఈ చిత్రానికి గోమటేష్ ఉపాధ్యే దర్శకత్వం చేస్తున్నాడు. అవసరాల శ్రీనివాస్, తిరువీర్ ఇప్పటికి వినిపిస్తోన్న ఇతర పాత్రలు. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటిలోనే విడుదల చేస్తారట. అంటే థియేటర్ మూవీ కాదు. అమెజాన్ ప్రైమ్ లో ప్యాన్ ఇండియన్ రేంజ్ లో స్ట్రీమ్ అవుతుంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తారు. మొత్తంగా నిత్య మీనన్ మరోసారి బలమైన పాత్రతోనే వస్తున్నట్టు కనిపిస్తోంది.

Related Posts