భగవంత్ కేసరి పోస్ట్ పోన్ .. నిజం ఎంత

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా భగవంత్ కేసరి. కాజల్ హీరోయిన్ గా శ్రీ లీల కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఇది. అఖండ, వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నటిస్తోన్న సినిమా కావడంతో హ్యాట్రిక్ గ్యారెంటీ అనుకుంటున్నారు. అటు అనిల్ కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఎంటర్టైనింగ్ మూవీస్ అందించడంలో అనిల్ తనకంటూ ఓ సెపరేట్ ట్రాక్ రికార్డ్ సెట్ చేసుకున్నాడు. ఆ రికార్డ్ ను మెయిన్టేన్ చేస్తూనే బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ మంచి కథను సెట్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ముందు నుంచీ చెబుతున్నారు.

ఇక అక్టోబర్ 19న దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటింయారు. అయితే తాజాగా ఈ మూవీ దసరా రేస్ నుంచి తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. దసరా నుంచి భగవంత్ కేసరి పోస్ట్ పోన్ అవుతుందంటూ ప్రచారం స్టార్ట్ అయింది. మరి ఇందులో నిజమెంతా అంటే అస్సలు లేదు అంటున్నారు మేకర్స్.


ఒక రకంగా రిలీజ్ డేట్ తో పోల్చుకుంటే షూటింగ్ అనుకున్నంత వేగంగా సాగలేదు అనేది నిజం. అంటే మరో నెలలో రిలీజ్ పెట్టుకుని ఇంకా సెట్స్ పైనే ఉందీ చిత్రం. బాలయ్య లాంటి సపోర్టింగ్ స్టార్ ఉంటే దర్శకుడు చాలా వేగంగా చిత్రీకరణలు చేసుకోవచ్చు. కాకపోతే అనుకోని అవాంతరంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వచ్చి పడటంతో బాలకృష్ణకు కొంత గ్యాప్ తప్పడం లేదు. అటు చూస్తే అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ ఇష్యూను సార్ట్ అవుట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన పైనే ఉంది. అందుకే అటు చంద్రబాబు నాయుడు బెయిల్ మేటర్ తో పాటు ఇటు భగవంత్ షూటింగ్ నూ బ్యాలన్స్ చేయడం కష్టం. ఈ టైమ్ లో ఎవరైనా.. షూటింగ్ ఆపుతారు. బాలయ్య కూడా అదే చేశాడు.

బట్.. పెండింగ్ షూట్ మరీ ఎక్కువగా ఏం లేదట. షూటింగ్ చాలా చివరి స్టేజ్ లో ఉందని సమాచారం. అందుకోసం బాలయ్య ఎక్కువ టెన్షన్ లేకుండా ఆరామ్ గానే సెట్స్ లోకి రావొచ్చు అని చెప్పిన అనిల్ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పై కాన్ సెంట్రేట్ చేశాడు. సో.. ఈ చిన్న వర్క్ మిగిలినా వెంటనే షూటింగ్ చేసి ఎడిట్ సూట్ కు ఇచ్చేస్తారు. సో నో ప్రాబ్లమ్. అందువల్ల అనుకున్న టైమ్ కు ఖచ్చితంగా అక్టోబర్ 19నే తలకొండ భగవంత్ కేసరి బాక్సాఫీస్ దండయాత్రకు వచ్చేస్తాడు అనేది మూవీ టీమ్ నుంచి స్ట్రాంగ్ గా వినిపిస్తోన్న మాట.

Related Posts