హాయ్ నాన్నా.. మళ్లీ మ్యాజిక్ చేసిన హేషమ్

హేషమ్ అబ్దుల్ వాహబ్.. లేటెస్ట్ టాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్.. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ఖుషీ చిత్రానికి ఆ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయంటే.. రిలీజ్ కు ముందు సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయంటే కారణం కేవలం హేషమ్ అందించిన పాటలే అంటే అతిశయోక్తి కాదు. నిజానికి అతను ఇండియన్ కాదు. బట్ మళయాలంలో మొదలుపెట్టి అక్కడ ఎన్నో మ్యూజికల్ మ్యాజిక్స్ చేశాడు. అక్కడి నుంచి తెలుగుకు వచ్చి.. ఖుషీతో తన ముద్రను బలంగా వేశాడు. ఆ ముద్రను కొనసాగిస్తున్నాను అనేలా ఇప్పుడు మరోసారి హాయ్ నాన్న పాట చూస్తే అర్థం అవుతుంది.


నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శౌర్యు దర్శకుడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రోమోతోనే అంచనాలు పెంచిన హేషమ్ అబ్దుల్ వాహబ్.. ఫుల్ సాంగ్ తో మరోసారి మెస్మరైజ్ చేశాడు. అద్బుతమైన ట్యూన్ తో ఆకట్టుకున్నాడు. సింపుల్ ఆర్కెస్ట్రైజేషన్ తో అదరగొట్టాడు. సాహిత్యం స్పష్టంగా వినిపించేలా ఇన్ స్ట్రుమెంట్స్ ను ఉపయోగించడం ఈ పాటకు హైలెట్ గా నిలిచింది. అనంత శ్రీరామ్ రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణకుమార్ ఆలపించారు.


“సమయమా బలే సాయం చేశావే ఒట్టుగా.. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా.. ఓ ఇది సరిపోదా..” అంటూ మొదలైన ఈ గీతంలో అనంత శ్రీరామ్ సాహితీ మెరుపులు కనిపిస్తాయి. ఫిమేల్ వెర్షన్ కోసం హేషమ్ ఉపయోగించిన శాస్త్రీయత బలే మెలోడియస్ గా ఉందని చెప్పాలి. మొత్తంగా తను టాలీవుడ్ లోనూ పాగా వేయబోతున్నాను అని ఈ పాటతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు హేషమ్. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ వెర్షన్‌స్ లోనూ ఈ గీతం విడుదలైంది.

Related Posts