యూ ట్యూబర్ తో నయనతార

హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ తో సత్తా చాటుతోన్న ఏకైక హీరోయిన్ నయనతార. తన సినిమాలకు ఓ మీడియం రేంజ్ హీరోలకు ఉన్నంత క్రేజ్ తో పాటు బిజినెస్ కూడా ఉంటుంది. అందుకే నిర్మాతలు కూడా నయన్ తో ఫీమేల్ సెంట్రిక్ మూవీ అంటే ఏ మాత్రం ఆలోచించరు

. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ కథలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ లేటెస్ట్ గా అలాంటి ఓ కథకు ఓకే చెప్పింది. రీసెంట్ గానే బాలీవుడ్ లోనూ అడుగుపెట్టిన నయనతార ఇప్పుడు షారుఖ్ ఖాన్ సరసన జవాన్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకుడు కావడం విశేషం. నిజానికి అట్లీ కోసమే నయనతార ఈ చిత్రానికి ఓకే చెప్పింది.


ఇక తమిళ్ లో ఓకే చేసిన లేడీ ఓరియంటెడ్ కథను ఓ యూ ట్యూబర్ డైరెక్ట్ చేయబోతుండటం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా యూ ట్యూబర్స్ దర్శకత్వం చేయడం ఇప్పటి వరకూ పెద్దగా చూడలేదు. చిన్నా చితకా సినిమాలు చేసి ఉంటే ఉండొచ్చు. బట్ నయనతార లాంటి టాప్ హీరోయిన్ ను ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు.

అతని పేరు డూడ్ విక్కీ. కోలీవుడ్ లో యూ ట్యూబర్ గా కాస్త ఫేమ్ ఉన్నవాడే. అతనే ఈ నయన్ తో లేడీ ఓరియంటెడ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక కార్తీ హీరోగా సర్దార్ అనే సినిమాను రూపొందించిన నిర్మాతలు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చెప్పింది కూడా సదరు నిర్మాతే కావడంతో విషయం కన్ఫార్మ్ అయింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది.

Related Posts