నాగ చైతన్య సినిమాకు ఏదీ కన్ఫార్మ్ కాదా

నాగ చైతన్య సినిమాకు ఏదీ కన్ఫార్మ్ కాదా

అక్కినేని నాగ చైతన్య.. కొన్నాళ్ల క్రితం వరుస హిట్స్ తో ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే సడెన్ గా మళ్లీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వరుసగా థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ చిత్రాలతో డిజాస్టర్స్ చూశాడు. వీటిలో డిజాస్టర్ పై అతనే చాలా ఆశలు పెట్టుకున్నాడు. చైతన్య హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినా.. వీక్ కంటెంట్ తో పాటు వీక్ నెరేషన్ వల్ల సినిమా పోయింది.

ఈ విషయంలో అతను చాలా బాధపడ్డాడు కూడా. అలాగని అలాగే ఆగిపోలేడు కదా..? అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కాన్ సెంట్రేట్ చేశాడు. ఇంతకు ముందు తనతో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు తీసిన చందు మొండేటితో గీతా ఆర్ట్స్ 2లో ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేశాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. కానీ ఏదీ కన్ఫార్మ్ అని చెప్పలేకపోతున్నారు మేకర్స్.


చైతన్య సరసన కీర్తి సురేష్‌ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఇంకా ఖరారు కాలేదు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ పేరు వినిపిస్తోంది. అతనూ ఇంకా ఎస్ చెప్పలేదు. ఈ లోగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ మరో వార్త వస్తోంది. అదే ‘తాండేల్’. ఈ సినిమా శ్రీకాకుళ సముద్రంలో జరిగే ఓ ఫిషర్ మేన్ కథ. తాండేల్ అనేది వారికి సంబంధించిన పేరు. అందుకే ఈ టైటిల్ నే పెట్టబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

కథలో భాగంగా వస్తే బావుంటుందేమో కానీ.. ఈ టైటిల్ ఆడియన్స్ కు ఎంత వరకూ కనెక్ట్ అవుతుందనేది పెద్ద ప్రశ్న. అఫ్‌ కోర్స్ ఇదే టైటిల్ అని కూడా ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ఇలా.. ఈ సినిమాకు సంబంధించి అన్నీ అట అనే మాటలే వస్తున్నాయి తప్ప.. ఏదీ ఫైనల్ అయినట్టు కనిపించడం లేదు. మరి ఈ ట కారం పోయి.. ఖరారు అనే మాట ఎప్పుడు వినిపిస్తుందో చూడాలి.

Related Posts