విజయ్ సినిమాలో దర్శకుల హవా

వరుస హిట్స్ తో దూసుకుపోతోన్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ తో లియో అనే సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన మాస్టర్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కాకపోతే ఎక్స్ పెక్ట్ చేసిన దాన్నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు అనే కామెంట్స్ మాత్రం వచ్చాయి.

ఆ లోటును తీర్చేందుకు విజయ్ ని లియో గా మార్చాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. త్రిష హీరోయిన్ గా.. ప్రియా ఆనంద్ మరో ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు. పాత్రలకు తగ్గ నటులను ఎంచుకోవడంలో లోకేష్ కనకరాజ్ స్టైల్ బలే ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రంలో సంజయ్ దత్ ను మెయిన్ విలన్ గా తీసుకున్నారు. అయితే లోకేష్ ఈ చిత్రంలో నటుల పాత్రలకోసం దర్శకులను తీసుకుని వారితోనే నింపేస్తున్నాడు.


ఇప్పటికే లియోలో స్టార్ డైరెక్టర్స్ అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో పాటు మిస్కిన్ కూడా ఉన్నారు. వీరి పాత్రలు ఏంటీ అనేది ఇంకా తెలియదు. అయితే లేటెస్ట్ గా మరో బాలీవుడ్ డైరెక్టర్ ను కూడా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాడు లోకేష్‌. దర్శకత్వం నుంచి గతంలోనే నటనలోకీ ఎంటర్ అయ్యి ఆల్రెడీ ఓ తమిళ్ మూవీలో మెయిన్ విలన్ గానూ నటించిన మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నాడు లోకేష్‌ కనకరాజ్. మరి లోకేష్ కు ఈ దర్శకులపై ప్రేమ, నమ్మకం ఏంటో కానీ.. వీళ్లంతా ఆల్రెడీ నటులుగానూ ప్రూవ్ చేసుకున్నవారే కావడం విశేషం.


ఇక ఈ దసరాకు విడుదల కాబోతోన్న లియో బిజినెస్ ఇప్పటికే అన్ని ఇండస్ట్రీస్ లలతో హాట్ టాపిక్ గా మారింది. ఆ రేంజ్ లో చెబుతున్నారు రైట్స్. తెలుగులో విజయ్ కి పెద్దగా మార్కెట్ లేదు. అయినా తెలుగు డబ్బింగ్ రైట్స్ గా 30 కోట్లు చెబుతున్నారు. ఓ నాలుగైదు కోట్లు అటూ ఇటూగా ఇది వర్కవుట్ అయ్యే అవకావం లేకపోలేదు. ముఖ్యంగా లోకేష్‌ గత సినిమా విక్రమ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్ర బిజినెస్ కు మరింత హైప్ వచ్చింది. ఏదేమైనా లియో.. ప్యాన్ ఇండియన్ రేంజ్ లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ అనిపించుకుంటోందిప్పుడు.

Related Posts