అల్లు అర్జున్ అరుదైన చిత్రం.. తగ్గేదే లే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్ వేదికగా అరుదైన ఘనత సాధించాడు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ విగ్రహావిష్కరణలో కనువిందు చేశాడు స్టైలిష్ స్టార్. తనే స్వయంగా లాంఛ్ చేసిన ఈ మైనపు ప్రతిమ వద్ద అల్లు అర్జున్ సందడి చేశాడు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అల్లు అర్జున్ డబుల్ ధమాకాగా కనిపిస్తున్న ఈ ఫోటోలలో అసలు ఎవరు? మైనపు విగ్రహం ఏది? అని తేల్చుకోవడం కష్టమే.

Related Posts