ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసి.. నెక్ట్స్ మూవీకే బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే అందరితో అయ్యేది కాదు. అది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో అయ్యింది. సీతారామంలో తన స్క్రీన్ ప్రెజెన్స, నటన చూసి తెలుగు వాళ్లంతా ఫిదా అయిపోయారు. అయితే ఆ పాత్రలా కాదు తను.. అవసరమైతే టూ పీస్ బికినీకి సైతం ఎస్ చెబుతుంది. సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో హాట్ హాట్ ఫోటోస్ తో రెచ్చగొడుతూనే ఉంది. అయితే సీతారామం తర్వాత కాస్త డోస్ తగ్గించినట్టు అనిపిస్తుంది.ప్రస్తుతం ఒక్కో సినిమాకు మూడు నుంచి మూడున్నర కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నా.. టాలీవుడ్ తను అడిగినంతా ఇస్తోంది.
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్.. నాని సరసన హా నాన్న అనే సినిమాలో నటిస్తోంది. శౌర్యు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ మూవీలో మరోసారి తనకు నటనకు ఆస్కారం ఉన్న గొప్ప పాత్ర పడినట్టు టాక్. డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు ఖుషీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతోన్న సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. ఫ్యామిలీ మేన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడులవుతుంది. ఇక తాజాగా మృణాల్ కు మెగాస్టార్ సరసన నటించే అవకాశం వచ్చిందని టాక్.
భోళా శంకర్ తర్వాత మరింత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు చిరంజీవి. అందుకే భోళా తర్వాత చేయాలనుకున్న కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమాను హోల్డ్ లో పెట్టారు. దాని తర్వాత రావాల్సిన వశిష్ట సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఇది జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ గా రాబోతోంది. ఆల్రెడీ ఈ తరహా కథతోనే వశిష్ట బింబిసార వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మరోసారి ఆ జానర్ లోనే మెగాస్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఈ చిత్రంలోనే హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ను తీసుకోవాలనుకుంటున్నారు. తనకు కథ కూడా చెప్పారట. మృణాల్ కూ ఇది మంచి అవకాశమే. ఒక్కసారి తను ఎస్ చెప్పగానే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది. కాకపోతే ప్రస్తుతం యంగ్ స్టర్స్ తో ఎక్కువగా సినిమాలు చేస్తున్న తను మెగాస్టార్ తో రొమాన్స్ కు ఒప్పుకుంటుందా అనేదే అసలు ప్రశ్న