బిగ్ బాస్ పై మండి పడుతున్న శివాజీ

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు హీరో శివాజీ. కొన్నాళ్లుగా అతను వెండితెరకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. పొలిటికల్ గా యాక్టివ్ గా కనిపించినా ఏ పార్టీలో ఉన్నాడు అనేది మాత్రం తేల్చలేదు. అప్పుడప్పుడూ తెలుగు దేశం పార్టీకి పూర్తి అనుకూలంగా జగన్ కు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఏది మాట్లాడినా అతను అగ్రెసివ్ గానే ఉంటాడు. అలాంటి శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం కొంత ఆశ్చర్యపరిచినా.. టఫ్ కంటెస్టెంట్ గానే చూశారు జనం. అందుకు తగ్గట్టుగానే అతను తన అగ్రెసివ్ నెస్ ను బిగ్ బాస్ పైనా చూపిస్తున్నాడు. ఈ గురువారం ఎపిసోడ్ ప్రోమో చూస్తే అతను బిగ్ బాస్ పై మండిపడుతున్నాడు.


ఈ ప్రోమో మొత్తం చూస్తే ముందుగా బిగ్ బాస్ కాఫీ పంపించలేదని బిగ్ బాస్ పై పాటలు పాడుతూ ఉన్న రతికను మీరు సింగింగ్ షోకు వచ్చినట్టుగా కనిపిస్తుందంటాడు. తర్వాత తేజను ఉద్దేశించి ‘ తేజా.. మైక్ వేసుకోవడం అంటే ఏదో ఒక మైక్ వేసుకోవడం కాదు. మీ మైక్ మీరు వేసుకోవడం’అని చెబుతాడు. ఆ తర్వాత మొదలైంది శివాజీ రచ్చ. ‘కాఫీ పంపవయ్యా బొక్కలోదీ..’ అంటూ చేతిలో ఉన్న వస్తువును కిందకి కొట్టేశాడు. కానీ కాఫీ లగ్జరీ బడ్జెట్ అని పక్కన ఎవరో అంటే.. బొక్కలో బడ్జెట్ అంటూ కౌంటర్ వేశాడు. తర్వాత షకీలా.. ‘ఆయనేం అడగటంలా.. కనీసం ఆయన ట్యాబ్లెట్ ఇవ్వట్లా మీరు.. ‘ అంటుంది. తర్వాత శివాజీ.. ‘ఇంకొక గంట చూస్తామ్మా బొక్క కూడ బయపడను నేనెవ్వడికి’అని షకీలాకు చెబుతాడు.


తర్వాత బిగ్ బాస్.. గౌతమ్ ను పిలిచి ‘గౌతమ్ శివాజీకి బిపి చెక్ చేసి బిగ్ బాస్ కి అప్డేట్ ఇవ్వండి’ అన్నాడు. దానికి శివాజీ గౌతమ్ పై మండిపడుతూ.. ఏం చూస్తావ్ తమ్ముడు నువ్వు.. అని బెదిరింపు ధోరణిలో అంటాడు. శివాజీ బిగ్ బాస్ ను ఉద్దేశిస్తూ.. నువ్వు చూసుకో బిపి.. నేను చాలా కిందకి ఉంటా.. నన్ను రెచ్చగొడితే మొత్తం పగలనూకి పోతా.. తలుపుతీయ్.. ఒక్క నిమిషం ఉంటే ఇక్కడ అడుగు మళ్లీ’ అంటాడు. అదేంటో బిగ్ బాస్ నిజంగానే మరింత రెచ్చగొట్టాలి అన్నట్టుగా.. ఒక స్టెతస్కోప్ ఇచ్చి ”రతికా.. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి.. వాళ్ల గుండె ఏం చెబుతుందో బిగ్ బాస్ కి చెప్పండి..” అంటాడు.


వెంటనే శివాజీ రతిక చేతిలో ఉన్న స్టెతస్కోప్ లాక్కుని నేను చెప్పను అంటూ.. ‘ నేను ఇక్కడ బాధపడుతూ ఉంటే అతనికి కామెడీగా ఉంది.. ఈ అమ్మాయి వెళ్లి మీ అందరికీ కామెడీ క్రియేట్ చేయాలా.. ? అందరియ్ చూడు శివాజీగాడ్ని వదిలేసి పిచ్చోడిని చేద్దాం అనుకుంటున్నాడా.. ఓ సామీ తలుపు ఈయ్ సామీ నేం పోతా.. ” అంటూ శివాజీ చేసిన హంగామాకు హౌస్ అంతా ఒక రకంగా అయిపోయింది. మరి శివాజీ అంతలా ఎందుకు రెచ్చిపోయాడు అనేది ఇవాళ్టి ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఏదేమైనా శివాజీ మాత్రం చాలా ఫ్రస్ట్రేషన్ లో కనిపిస్తున్నాడు.

Related Posts