మహేష్ బర్త్ డే స్పెషల్ ఉంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా గుంటూరు కారం. ప్రారంభం నుంచి ప్రాబ్లమ్స్ తోనే సాగుతోందీ సినిమా షూటింగ్. అనుకున్న టైమ్ కంటే బాగా ఆలస్యం అవుతోంది. దీని వల్ల టెక్నీషియన్స్ కూడా మారిపోతున్నారు. కొన్నాళ్లుగా సంగీత దర్శకుడు తమన్ కు త్రివిక్రమ్ కు మధ్య మంచి ట్యూన్ కుదిరింది. అందుకే ఈ చిత్రానికి కూడా అతన్నే తీసుకున్నాడు. కానీ తమన్ సంగీతం అంటే ఇప్పుడు మహేష్ బాబుకు ఇష్టం లేదు.

అతన్ని మార్చమని చెబుతూ వస్తున్నాడు. త్రివిక్రమ్ మాత్రం మహేష్ కు సర్ది చెబుతున్నాడు.అందుకే ఈ మూవీ సాంగ్స్ బాగా ఆలస్యం అయ్యాయి. అయితే ఈ బుధవారం సూపర్ స్టార్ బర్త్ డే. ఈ సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే తమన్ ట్యూన్స్ మహేష్ కు నచ్చడం లేదు. దీంతో బర్త్ డే స్పెషల్ గా గుంటూరు కారం నుంచి ఏ స్పెషల్ అప్డేట్ ఉండదు అని దాదాపుగా ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. బట్ అలా ఏం లేదు.అభిమానులకు స్పెషల్ ఉంది. రీసెంట్ గా ఓ ట్యూన్ ను ఆయనకు పంపించారు. ఇష్టం ఉందో లేదో కానీ ఈ ట్యూన్ ను ఓకే చేశాడు మహేష్ బాబు.


బర్త్ డే రోజు సాయంత్రం 4.05 గంటలకు ఈ సాంగ్ ప్రోమో వస్తుంది. అంటే ఫుల్ సాంగ్ ను అప్పుడే ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి ప్రోమో మాత్రం వస్తుంది.ఈ ప్రోమోతోనే తమన్ తనేంటో ప్రూవ్ చేసుకోబోతున్నాడు.ఫుల్ సాంగ్ ఎప్పుడు అనేది ప్రోమోలోనే చెప్పబోతున్నారు. సో.. ఫ్యాన్స్ బిజినెస్ మేన్ తో పాటు ఈ ప్రోమోను కూడా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. సో.. గుంటూరు కారం నుంచి స్పెషల్ ఉంది.


ఇక మహేష్ బాబు సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఈ నెల మూడో వారం నుంచి రెగ్యులర్ గా జరుగుతుంది. ఇక నుంచి ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొంటాడట మహేష్ బాబు. అలా చేస్తేనే ముందు అనుకున్నట్టుగా సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారు. లేదంటే సమ్మర్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ రాకుండా షూటింగ్ కంటిన్యూ చేసేందుకు ఒకే చెప్పాడు మహేష్.

ఇక గుంటూరు కారం నుంచి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కుమార్ తప్పుకున్నాడు. ఆ స్థానంలో మహేష్ కు బాగా ఇష్టమైన రవి కే చంద్రన్ వస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా కరెక్ట్ గా ట్యూన్ అయితే ఈ సినిమాకు ఇకపై ఏ సమస్యలూ ఉండవనే చెప్పాలి. మొత్తంగా ఫ్యాన్స్ కు గుంటూరు కారం నుంచి బర్త్ డే స్పెషల్ వస్తుంది.

Related Posts