రజినీ మానియాతో షేక్ అవుతున్న బుకింగ్స్

జైలర్.. సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో ఒక్కసారిగా సిట్యుయేషన్ మారింది. రజినీకాంత్ స్వాగ్ కు కంట్రీ మొత్తం ఫిదా అయిపోతోంది. బాషా రేంజ్ లో ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాలో కనిపించబోతోందని అర్థమైంది. భారీ తారాగణంతో పాటు అనిరుధ్ ఆర్ఆర్ నెక్ట్స్ లెవల్లో కనిపిస్తోంది. ఎలా చూసినా కబాలి తర్వాత రజినీకాంత్ సినిమా ట్రైలర్ కు మళ్లీ ఆ రేంజ్ లో హైప్ వచ్చింది. ట్రైలర్ కు వచ్చింది అంటే సినిమాకు రాకుండా ఉంటుందా.. వచ్చింది. అందుకే జైలర్ అడ్వాన్స్ బుకింగ్స్ లో సునామీ క్రియేట్ చేస్తోంది. సౌత్ తో పాటు ముంబై, యూఎస్ లాంటి చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇటు తెలుగులోనూ చాలా రోజుల తర్వాత రజినీకాంత్ సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది. హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో తమిళ్ వెర్షన్ కు ఎక్కువ బుకింగ్స్ జరుగుతుండటం విశేషం.

ఇప్పటికే 80శాతం బుకింగ్స్ అయిపోయాయి. రేపటి వరకూ హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అవుతుందంటున్నారు. అంటే లాంగ్ వీకెండ్ తో పాటు ఇండిపెండెన్స్ డే హాలిడేస్ కూడా యాడ్ అవుతుండటంతో ఈ మూవీకి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా.. ఆటోమేటిక్ గా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. కలెక్షన్స్ పరంగానూ కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. దీనికి ముందు ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్ పై కన్నేశాడు జైలర్. ఈ మధ్య వచ్చిన కోలీవుడ్ మూవీస్ రికార్డ్స్ ను జైలర్ బీట్ చేస్తాడు అనేది అక్కడి విశ్లేషకుల అంచనా. మొత్తంగా రజినీకాంత్ మేనియాకు అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ భారీ ఊపు కనిపిస్తోంది.


రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించిన ఈ మూవీలో తమన్నా, జాకీ ష్రాఫ్‌, వినాయకన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర దర్శకుడు నెల్సన్ చివరి సినిమా బీస్ట్ డిజాస్టర్ అయింది. అయినా రజినీకాంత్ అతన్ని నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఇతను ఓ బ్లాక్ బస్టర్ ఇస్తే ఖచ్చితంగా అనేక రికార్డులు బద్ధలవుతాయి.