అంబటి రాంబాబుపై చిరంజీవి సెటైర్స్

బ్రో.. సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా.. అంబటి రాంబాబుపైనా కొన్ని సెటైర్స్ పడ్డాయి. దీంతో తనపై సెటైర్స్ వేశారని అంబటి రాంబాబు అదే పనిగా రోజూ ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఈ చిత్రాన్ని ఇరిటేట్ చేశాడు. కలెక్షన్స్ లేవన్నాడు. సినిమా డిజాస్టర్ అన్నాడు. పవన్ కళ్యాణ్‌ రెమ్యూనరేషన్ పై మాట్లాడాడు. ఆ రెమ్యూనరేషన్ ను కూడా ఈ సినిమా కలెక్ట్ చేయలేకపోయిందీ.. అంటూ పవన్ కళ్యాణ్‌ పై తను సినిమాలు చేస్తాననీ.. మళ్లీ మూడు పెళ్లిల్లు మేటర్ ను లాగి నానా యాగీ చేశాడు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్‌ ఎక్కడా డైరెక్ట్ గా అటాక్ చేయలేదు కానీ.. నిర్మాత మాత్రం అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ గానే కౌంటర్స్ వేశాడు. అన్ని ఇంటర్వ్యూస్ లోనూ అంబటి గురించి, కలెక్షన్స్ గురించి, రెమ్యూనేషన్ గురించి అడిగిన ప్రశ్నలను దాటవేయకుండా టిజి విశ్వ ప్రసాద్ స్ట్రాంగ్ గానే నిలబడ్డాడు. తనకు ఈ సినిమా వల్ల ఎలాంటి నష్టం లేదని గట్టిగా చెబుతూ వచ్చాడు. ఇక పవన్ కు, బ్రో సినిమాకు సపోర్ట్ గా ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించలేదు. అది మామూలుగా కనిపించే వ్యవహారమే.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇన్ డైరెక్ట్ గా చురకలు వేశాడు. పనిలో పనిగా అంబటినీ పేరు పెట్టకుండా ఓ మాట అన్నాడు.
“మీరు పెద్ద పెద్ద విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వండి. ప్రత్యేక హోదా గానీ, మనకి రావాల్సిన ప్రాజెక్ట్స్ గానీ, రోడ్డు నిర్మాణాలు కానీ, వాటి పైన మాట్లాడకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మా రెమ్యునరేషన్ ల మీద మాట్లాడ్డం తప్పు.. ” ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వాల్తేర్ వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ విషయంపై చిరంజీవి మాట్లాడతాడు అని మెగా ఫ్యాన్స్ కూడా ఊహించలేదు. ఈ శుక్రవారం తన సినిమా రిలీజ్ ఉన్నా చిరు సెటైర్స్ వేశాడంటే ఆ టైమ్ లో బ్రో సినిమాకు ఏపి ప్రభుత్వం చేసిన నష్టం గురించి ఎంత బాధపడి ఉంటాడో అనుకోవచ్చు. నిజమే ఏపీ ప్రభుత్వం అభివృద్ధి గురించి కంటే కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్‌ మీదుగా సినిమా వారిని ఇబ్బంది పెట్టడంలోనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. మరి మెగాస్టార్ వ్యాఖ్యలకు శ్యాంబాబు అలియాస్ రాంబాబుగారు మళ్లీ రెచ్చిపోతాడా లేక కామ్ గా ఉంటాడా అనేది చూడాలి.

Related Posts